మానవత్వం చాటుకున్న హరీష్ రావు: క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు

By narsimha lodeFirst Published Oct 27, 2021, 8:54 PM IST
Highlights


తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మానవత్వాన్ని చాటుకున్నారు. జమ్మికుంటలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని మంత్రి దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు.


కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి Harish Rao మానవత్వాన్ని చాటుకున్నారు.ఎన్నికల ప్రచారం నుండి తిరిగి వస్తున్న సమయంలో  రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు.

"

also read:Huzurabad ByPoll: ఈటల‌కు హరీశ్ రావు సవాల్... రుజువు చేస్తే రాజీనామా చేస్తా: ప్లేస్, టైం డిసైడ్ చేయ్

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని తుమ్మనపల్లి వద్ద బుధవారం నాడు సాయంత్రం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న  ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. Huzurabad bypoll సందర్భంగా జమ్మికుంటలో ఎన్నికల ప్రచారం ముగించుకొని తుమ్మనపల్లి మీదుగా వెళ్తున హరీష్ రావు ఈ ప్రమాదాన్ని చూశాడు. వెంటనే ఆయన తన వాహనాన్ని నిలిపివేశాడు.

ఇవాళ కూడ జమ్మికుంట ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని మీడియా సమావేశంలో మంత్రిపాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి మంత్రి వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకొంది. దీంతో మంత్రి రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి పంపించిన తర్వాతే మంత్రి అక్కడి నుండి కదిలారు. ప్రమాదం జరిగిన తీరును కూడ స్థానికులను ఆయన అడిగి తెలుసుకొన్నారు.ప్రమాదం జరిగిన తీరును ఓ ప్రత్యక్ష సాక్షి మంత్రికి వివరించారు.

108 అంబులెన్స్ కు మంత్రి హరీష్ రావు పోన్ చేశాడు. అంబులెన్స్ లో ముగ్గురిని ఆసుపత్రికి పంపాడు. గాయపడిన వారికి టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మంత్రి హరీష్ రావులు కొంత ఆర్ధిక సహాయం అందించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి హరీష్ రావు దాదాపు మూడు మాసాలుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ లోనే మకాం వేసి టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డిలో గతంలో రోడ్డు ప్రమాదానికి గురై గాయపడిన వారిని మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి తరలించారు. ఓ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి మిరుదొడ్డి మండలం ఖాజాపూర్ కు చేరుకొనేసరికి అక్కడే ఓ మోటార్ బైక్ అదుపుతప్పి ఒకే కుటుంబానికి చెందినవారు గాయపడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన మంత్రి హరీష్ రావు వెంటనే 108 అంబులెన్స్ పిలిపించి వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఏడాది జూన్ మాసంలో మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ముందు వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఈ వాహనంలోని సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం నుండి మంత్రి హరీష్ రావు తృటిలో తప్పించుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుకు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకొన్న విషయం తెలిసిందే.

మంత్రి హరీష్ రావు ఎన్నికల సమయంలోనే కాదు సాధారణంగానే నిత్యం వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు.. ప్రజల మధ్యే ఎక్కువసేపు గడుపుతారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన తీరిక లేకుండా ఉంటారు.  రోజు ఎక్కువ సేపు ఆయన పర్యటిస్తూనే ఉంటారు.ఈ సమయాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగితే బాధితులకు సహాయం చేస్తుంటారు.

 
 

 

click me!