హుజురాబాద్ ఉపఎన్నికపై బిజెపి నిర్వహించిన సర్వే రిపోర్ట్ వచ్చిందని... ఈటల రాజేందర్ బంపర్ మెజారిటీలో గెలవబోతున్నాడని తేలిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి చివరిరోజయిన ఇవాళ(బుధవారం) బిజెపి, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. తమదంటే తమదే గెలుపని... సర్వేలో కూడా ఇదే తేలిందని ఇరు పార్టీలు చెబుతున్నాయి. ఇవాళ ఉదయమే రెండు మూడు సర్వేలు వచ్చాయని... ఈ సర్వే రిపోర్టులన్నీ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు అనుకూలంగా ఉన్నాయని మంత్రి హరీష్ తెలిపారు. అయితే బిజెపి చేపట్టిన సర్వేప్రకారం తమ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీ తో గెలుస్తారని తేలిందని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.
ఇలా ఇరు పార్టీలు సర్వేల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నాయి. విజయం తమదేనని చెప్పడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి BJP, TRS పార్టీలు. ప్రచారం ముగింపు రోజు ఇలా సర్వేల ఫలితం తమకే అనుకూలమంటూ పార్టీలుచేస్తున్న ప్రచారం వెనుక రాజకీయ ఎత్తుగడ దాగుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గెలిచే పార్టీకి ఓటేసి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సామాన్య ఓటర్ భావిస్తుంటాడు. కాబట్టి తమదే గెలుపని చెప్పడం ద్వారా అలాంటి ఓట్లను పొందవచ్చన్నది బిజెపి, టీఆర్ఎస్ పార్టీల ఎత్తుగడ అయివుంటుందని చెబుతున్నారు.
undefined
read more సర్వే రిపోర్టులొచ్చాయి, హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌దే గెలుపు: హరీష్ రావు
ఇదిలావుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, cm kcr పై bandi sanjay సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ తాలిబాన్ సీఎంగా మారారని... రైతుల పట్ల అరాచకంగా వ్యవహరిస్తూ వారికి కనీసం విత్తనాలు కూడా దొరకకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం కోర్ట్ తీర్పును గౌరవించని కలెక్టర్లు ఏం కలెక్టర్లు అంటూ siddipet collector వ్యవహారంపై మండిపడ్డారు.
ఇటీవల న్యాయస్థానంలో టీఆర్ఎస్ ప్రభుత్వ న్యాయవాది దళిత బంధు అమలుకు అన్ని పార్టీలు సహకరించాయని చెప్పారని బండి సంజయ్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ న్యాయవాది కూడా తమకు దళిత బంధుపై ఎవరు లేఖ రాయలేదని... మేమే సుమోటాగా తీసుకున్నామని చెప్పారన్నారు. దళిత బంధు బిజెపి, ఈటల రాజేందర్ వల్లే ఆగిపోయిందన్న టీఆర్ఎస్ వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా దళితులకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్షమాపణ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేసారు.
read more Huzurabad Bypoll:తాలిబాన్లను తలపించేలా టీఆర్ఎస్ పాలన..: బండి సంజయ్ సంచలనం
''క్రికెట్ లో కామెంటేటర్ హర్ష భోగ్లే ఎలాగో రాజకీయాల్లో కెసిఆర్ అలా... ఇద్దరూ ఒక్కటే. ఇద్దరివి మాటలు తప్ప చేతలు ఉండవు. తెలంగాణలో 10లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పేరు మీద ఉచితంగా ఇచ్చాము. కోవిద్ సందర్భంగా 6 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చాము. టీఆర్ఎస్ ఏమిచ్చింది?'' అని సంజయ్ నిలదీసారు.