తెలంగాణ కల్లు భేష్

First Published Jun 10, 2017, 4:15 PM IST
Highlights

తెలంగాణ వచ్చాక  ముఖ్యమంత్రి  వెంటనే కల్లు కంపౌండ్ తెరిపించి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. కల్లు కాంపౌండ్ లు ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు  కల్తీ జరగకుండా తగు జాగ్రత్తలు, కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు కల్తీ కల్లు బారిన పడలేదు

తెలంగాణ కల్లు రాష్ట్ర ఎక్సయిజ్ మంత్రి  టి పద్మారావు బేస్ అన్నారు.

శనివారం మంత్రి అధికారులతో కలిసి బోయగూడ లో ఉన్న కల్లు కంపౌండ్ ని ఆకస్మిక తనిఖీ చేసారు.. రోజు రోజు వారీగా చెట్లనుండి కల్లు వస్తుందా ? వాటిని ఎలా నిల్వ చేస్తున్నారు? ఎలాంటి భద్రతలు తీసుకుంటున్నారు అని మంత్రి అరా తీశారు.

ఇలా ఒక రాష్టమంత్రి సీనియర్ అధికారులను వెంటేసుకుని కల్లు కాంపౌండ్ సందర్శించి క్వాలిటి గురించి వాకబు చేయడం ఇటీవలి కాలంలో ఎపుడూ జరగలేదు.

కల్లుకాంపౌండ్ లో మాట్లాడుతూ, ‘‘గత సమైక్య ప్రభుత్వం లో కల్లు కంపౌండ్ మూసివేసి గౌడు కులస్థుల పొట్టగొట్టారు . ప్రభుత్వం ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే కల్లు కంపౌండ్ తెరిపించి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు.. కల్లు కాంపౌండ్ లు ప్రారంభించి మూడు  సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు  కల్తీ జరగకుండా తగు జాగ్రత్తలు, కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు కల్తీ కల్లు బారిన పడలేదు" అని అన్నారు.


తెలంగాణ ప్రభుత్వం గీతకార్మికుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది.. అతి త్వరలోనే కేరళ మాదిరిగా తాడిచెట్లు ఎక్కే మిషిన్లను ఉచితంగా గీతకార్మికులు అందిస్తాం అని కూడా మంత్రి అన్నారు.


రోజు కల్లు ఎలా విక్రయిస్తున్నారు ఎలా అమ్ముతున్నారు? గ్రామాల్లో నుండి వచ్చే తాటికల్లును 
ఎలా భద్రపరిచి తెస్తున్నారు రోజు వారీగా మిగిలిన కల్లు ని ఏమి చేస్తున్నారు? అని మంత్రి అరా తీశారు! మంత్రి అడిగిన ప్రశ్నలకు సిబ్బంది జవాబు ఇవ్వడం తో మంత్రి సంతృప్తి వ్యక్తం చేసారు.

మంత్రి వెంట వచ్చిన బిక్షపతి (ప్రముఖ శాస్త్రవేత్త) గ్లాస్ లో కొంత తాటికల్లు తీసుకోని త్రాగి బాగుంది అని కితాబు ఇచ్చారు.

మంత్రి వెంట ప్రిన్సిపాల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ తదితరులు వున్నారు..

click me!