ESI Medical Scam:వేలకోట్లకు చేరువలో దేవికారాణి అవినీతి ఆస్తులు

Published : Dec 31, 2019, 04:27 PM ISTUpdated : Dec 31, 2019, 04:44 PM IST
ESI Medical Scam:వేలకోట్లకు చేరువలో దేవికారాణి అవినీతి ఆస్తులు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల అవినీతి తవ్వేకొద్ది బయటపడుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల అవినీతి తవ్వేకొద్ది బయటపడుతోంది. తాజాగా ఓమ్ని చైర్మన్ శ్రీహరి బాబు షెల్ కంపెనీ పేరిట ప్రభుత్వానికి రూ.110 కోట్ల టోకరా పెట్టినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.

ఈ క్రమంలో ఆయనకు దేవికా రాణి, పద్మలు సహకారం అందించారు. లెజెండ్ పేరుతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన ఓమ్నీ బాబు.. దానికి యజమానిగా కృపాసాగర్ రెడ్డిగా పేర్కొన్నాడు. అంతా కుమ్మక్కై తెల్ల రక్తకణాల కిట్స్‌ కొనుగోలులో భారీ అవినీతికి తెరదీశారు.

Also Read:ఈఎస్ఐ స్కాం: దేవికా రాణి దోపిడికి సాయం చేసింది వీరిద్దరే

లెజెండ్ షెల్ కంపెనీ రూ.11,880 వేల కోట్ల విలువ చేసే కిట్లను రూ.30,800 లకు కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియకు దేవికారాణి, పద్మలు సంపూర్ణ సహకారం అందించారు. ఈ లావాదేవీలకు సంబంధించిన సొమ్మును లెజెండ్ అకౌంట్స్ నుంచి శ్రీహరి బాబు అకౌంట్స్‌కు బదిలీ చేశారు.

ఈ క్రమంలో శ్రీహరిబాబుకు రూ.99 కోట్లు, ఆయన భార్య పేరిట రూ.7 కోట్లు, శ్రీహరి పేరిట రూ.27 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. అదే సమయంలో గ్లూకోజ్ క్యూయెట్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి.

Also Read:ESI scam: దేవికారాణి ఆస్తుల విలువ రూ.200 కోట్లు: చిట్టా ఇదే..!!

రూ.1980ల క్యూయేట్‌ను దేవికా రాణి రూ.6,200లకు కొనుగోలు చేసింది. తద్వారా సుమారు రూ.13 కోట్లు అధికంగా శ్రీహరి బాబు సంపాదించి... 2017-18 సంవత్సరానికి రూ.19 లక్షల ఐటీ చెల్లించాడు. ఈ నేపథ్యంలో శ్రీహరి బాబును ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. లెజెండ్ యజమాని కృపాసాగర్, ఓమ్మి ఉద్యోగి వెంకటేశ్వర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu