తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేష్‌కుమార్‌

By narsimha lodeFirst Published Dec 31, 2019, 4:07 PM IST
Highlights

తెలంగాణ సీఎస్‌గా సోమేష్‌కుమార్ మంగళవారం నాడు నియమితులయ్యారు. 

హైదరాబాద్: తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేష్‌కుమార్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇవాళ సోమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ ఎస్‌కె జోషీ ఇవాళ రిటైరయ్యారు.

Also readతెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?: రేసులో వీరే...

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా  ఎస్‌కె జోషీకి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు సోమేష్‌కుమార్  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు.

14 మంది స్పెసల్ చీప్ సెక్రటరీలు ఈ పదవి కోసం పోటీపడ్డారు. ప్రధానంగా అజయ్ మిశ్రా, సోమేష్‌కుమార్ మధ్యే పోటీ నెలకొంది.తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సోమేష్‌కుమార్‌ వైపు మొగ్గు చూపారు. 1989 బ్యాచ్‌కు చెందిన సోమేష్ కుమార్  బీహార్ రాష్ట్రానికి చెందినవాడు.

తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషీ ఇవాళ రిటైరయ్యారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు రాత్రి సీఎస్ ఎంపికపై కసరత్తు నిర్వహించారు. సోమేష్ కుమార్ తో పాటు అజయ్ మిశ్రా పేరు కూడ సీఎస్ రేసులో విన్పించింది.కానీ, చివరకు కేసీఆర్ సోమేష్ కుమార్ వైపు మొగ్గు చూపారు. 

తెలంగాణ సీఎస్ పదవికి 14 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు పోటీ పడ్డారు.. బీపీ ఆచార్య, బినయ్ కుమార్, అజయ్ మిశ్రా, పుష్ప సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారీ, రాజీవ్ రంజన్ మిశ్రా, సోమేష్ కుమార్, శాంతికుమారి, షాలినీ మిశ్రా, అధర్ సిన్హా, వసుధా మిశ్రాలు పోటీలో ఉన్నారు.

ప్రధానంగా అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ ల పేర్లు సీఎస్ పదవి కోసం విన్పిస్తున్నాయి. సోమేష్ కుమార్ గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖతో పాటు పలు కీలకమైన శాఖల్లో పనిచేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్  విశ్వాసంలో తీసుకొన్న ఐఎఎస్ అధికారుల్లో  సోమేష్ కుమార్ పేరు ప్రధానంగా విన్పిస్తోంది.దీంతో సోమేష్ కుమార్ కు  సీఎస్ గా కేసీఆర్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం నాడు ఉదయానికి కొత్త సీఎస్ గా సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.  

అందరూ ఊహించినట్టుగానే దీంతో సోమేష్ కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎస్ ఎస్‌కె జోషీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. 

రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సోమేష్ కుమార్ కొనసాగుతున్నారు. ఏపీ రాష్ట్రానికి సోమేష్ కుమార్ ఎంపిక చేశారు. అయితే ట్రిబ్యునల్ కు వెళ్లి సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు.


 

click me!