ఏపీ,తెలంగాణ మధ్య జలజగడం:కేఆర్ఎంబీకి తెలంగాణ మరో లేఖ

By narsimha lode  |  First Published Aug 12, 2021, 2:31 PM IST

కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం గురువారం నాడులేఖ రాసింది.  ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించకుండా ఉండేలా చూడాలని ఆ లేఖలో కోరింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు ఈ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.



హైదరాబాద్: కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం గురువారం నాడు లేఖ రాసింది. తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నది నుండి అక్రమంగా నీటిని తరలించకుండా చూడాలని ఆ లేఖలో కోరారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. కృష్ణా నదీ జలాల విషయంలో  రెండు రాష్ట్రాలు తమ వాదనలను సమర్దించుకొంటున్నాయి. ఈ క్రమంలోనే  తెలంగాణ రాష్ట్రం ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకోకుండా చూడాలని కేఆర్ఎంబీకి లేఖ రాసింది.

Latest Videos

also read:రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం.. 16లోగా ఎన్జీటికి నివేదిక

అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని తరలించకుండా  చూడాలని ఆ లేఖలో ఈఎన్సీ కోరారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి నీటి తరలింపును నిలిపివేయాలని కోరారు. మాల్యాల పంపింగ్ స్టేషన్ నుండి కూడ నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని  ఈ ఎన్సీ కోరారు.
 

click me!