
తెలంగాణలో ఈ నెల 14వ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించాల్సిన TS EAMCET పరీక్షను వాయిదా వేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా మారిన వాతావరణం, కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నేడు (సోమవారం) భేటీ కానుంది.
టీఆర్ఎస్‌లో ‘‘షిండే’’లు ఎందరో.. ఆ మాట వింటనే కేసీఆర్‌కు వెన్నులో వణుకు : బండి సంజయ్
కింది స్థాయిలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ఐఎండీ తాజా నివేదికల ఆధారంగా ఈ అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అగ్రికల్చర్, మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉమ్మడిగా ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ఎంసెట్ పరీక్ష కోసం ఆఫీసర్లు ఇప్పటికే అంతా సిద్ధం చేశారు. కానీ భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ అంతటా వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
సైన్యంలోనేనా... ప్రభుత్వంలో యువరక్తం వద్దా, ముందు మోడీని తప్పించాలి : అగ్నిపథ్‌పై కేసీఆర్ స్పందన
ఈ నేపథ్యంలో స్టూడెంట్లు ఎక్సామ్ సెంటర్లకు వెళ్లడం కష్టంగా మారే అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలెర్ట్ లు కూడా ప్రకటించింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల పలు చోట్ల కరెంటు తీగలు పడిపోయాయి. అక్కడక్కడా పోల్స్ కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఇంటర్నెట్ బంద్ అయ్యింది. కరెంటు సరఫరాకు కూడా బ్రేక్ పడింది. అయితే ఈ పరీక్ష ఒకే సారి అనేక సెంటర్లలో జరుగుతుంది. అయితే ఆ పరీక్షా కేంద్రాల్లో అనేక చోట్ల ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. స్టూడెంట్లకు కొన్ని చోట్ల కూర్చొనేందుకు కూడా సరైన సదుపాయాలు లేవు. పరీక్ష నిర్వహణకు ప్రాథమిక అవసరాలైన విద్యుత్ సేవలు వంటివి కొన్ని చోట్ల నిలిచిపోయాయి. ఈ కారణాలన్నింటీ దృష్యా ప్రస్తుతానికి ఎంసెట్ ను వాయిదా వేయడమే మంచిదనే వాదనలే అధికారుల్లో వినిపిస్తున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. అత్యవసరమైతేనే బయటకు రండి: హైదరాబాద్ సీపీ
TS EAMCET - 2022 కు ఈ సారి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 1,71,945, అగ్నికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 94,150 మంది స్టూడెంట్లు అప్లయ్ చేసుకున్నారని ‘సాక్షి’ దినపత్రిక నివేదించింది. అయితే గతంతో పోలిస్తే ఈ సారి అప్లికేషన్ల సంఖ్య పెరిగింది. అయితే ఈ పరీక్ష ల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 109 సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే చాలా చోట్ల వర్షాల వల్ల పరిస్థితి మొత్తం తలకిందులైంది. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు.