సైన్యంలోనేనా... ప్రభుత్వంలో యువరక్తం వద్దా, ముందు మోడీని తప్పించాలి : అగ్నిపథ్‌పై కేసీఆర్ స్పందన

Siva Kodati |  
Published : Jul 10, 2022, 09:44 PM IST
సైన్యంలోనేనా... ప్రభుత్వంలో యువరక్తం వద్దా, ముందు మోడీని తప్పించాలి : అగ్నిపథ్‌పై కేసీఆర్ స్పందన

సారాంశం

అగ్నిపథ్ స్కీమ్ పై స్పందించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అగ్నిపథ్ స్కీమ్ పెద్ద బ్లండర్ అని.. దేశానికి ప్రాణమిచ్చే జవాన్ తయారు కావాలంటే ఏడు నుంచి ఎనిమిదేళ్ల సమయం పడుతుందని  సీఎం అన్నారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్నిపథ్ పథకంపై కౌంటరిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. సేనల్లో యువరక్తం కావాలంటున్నారని.. ప్రభుత్వంలో వద్దా అని కేసీఆర్ బీజేపీని ప్రశ్నించారు. మోడీని తప్పిస్తే కూడా సరిపోతుందంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్ పెద్ద బ్లండర్ అని.. దేశానికి ప్రాణమిచ్చే జవాన్ తయారు కావాలంటే ఏడు నుంచి ఎనిమిదేళ్ల సమయం పడుతుందని కేసీఆర్ అన్నారు. దేశం మీద కనీస ప్రేమ వున్నవాళ్లు కూడా ఇలాంటి తప్పు చేయరని ఆయన ఎద్దేవా చేశారు. కాశీ లాంటి మహా పుణ్యక్షేత్రాన్ని నట్లు, బోల్టులతో కట్టాడని.. మొన్నటికి మొన్న ప్రధాన గోపురమే కూలిపోయిందంటూ కేసీఆర్ చురకలు వేశారు. 

ఇది దేశానికి మంచిది కాదని... ఎన్నికల కోసం హడావిడిగా కాశీ కారిడార్ కట్టారని సీఎం ఆరోపించారు. క్రూరమైన వికృత రాజకీయ క్రీడతో కశ్మీరీ పండిట్ల ప్రాణాలు బలిగొంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాశ్మీరీ ఫైల్స్ అని సినిమా తీసి మాయ చేయాలనుకున్నారని... వాళ్ల రక్తం మీద నడిచి అధికారం చేపడతారా అని సీఎం ప్రశ్నించారు. మోడీ కూడా నాలాగే గుజరాత్ సీఎంగా వున్నవాడేనని... నేనేందుకు జాతీయ రాజకీయాలు చేయకూడదని కేసీఆర్ నిలదీశారు. మోడీ ప్రభుత్వాన్ని మారుస్తామని.. ఎల్ఐసీని అమ్మనివ్వమని సీఎం స్పష్టం చేశారు. భారత ప్రధాని మీద శ్రీలంక మంత్రి ఆరోపణలు చేశారని.. దేశం పరువు పోలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. మోడీ ఒత్తిడి వల్లే పోర్టు కేటాయించామని శ్రీలంక మంత్రి చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. 

ALso Read:మీరు ముందస్తుకు వెళితే నేనూ రెడీ .. డేట్, టైం చెప్పండి: బీజేపీకి కేసీఆర్ సవాల్

విద్యుత్ పాలసీ ఒక చెత్త విధానమన్న కేసీఆర్.. దేశ రాజధానిలోనే మంచినీటి కొరత వుందన్నారు. ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది నిజం కాదా.. ఏడాదికి కోటీ 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న దానిలో 20 శాతమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోందా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ తెలివి తక్కువతనంతో దేశాన్ని నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు లొడలొడ లొల్లి పెట్టుడే తెలుసునంటూ కేసీఆర్ చురకలు వేశారు. భయంకర కుంభకోణాలు, బీజేపీవి అనారోగ్యకరమైన విధానాలని సీఎం అన్నారు. 

దేశ తలసరి ఆదాయం లక్షా 49 వేల 848 రూపాయలని.. తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 78 వేల 833 రూపాయలని కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయిందని... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి తీరతామని సీఎం స్పష్టం చేశారు. మోడీ చెప్పినట్లే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో బీజేపీ పోయి తెలంగాణ లాంటి ప్రభుత్వం రావాలని సీఎం ఆకాంక్షించారు. యూపీ నుంచి ఒకాయన లుంగీ కట్టుకుని వచ్చాడని... ఆయన ఉపన్యాసం చెబితే మనం వినాలట అంటూ యోగి ఆదిత్యనాథ్ పై సెటైర్లు వేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువగా వుందని కేసీఆర్ గుర్తుచేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?