తెలంగాణలో నలుగురు ఐఏఎస్, 13 మంది ఐపీఎస్ అధికారులపై ఈసీ ఆగ్రహం.. సీవీ ఆనంద్‌పైనా వేటు

By Siva Kodati  |  First Published Oct 11, 2023, 8:05 PM IST

తెలంగాణలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమీషనర్లను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. 


తెలంగాణలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమీషనర్లను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. యాదాద్రి, నిర్మల్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్లను బదిలీ చేసింది. అలాగే వరంగల్ సీపీ రంగనాథ్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా నిజామాబాద్, ఖమ్మం సీపీలను కూడా బదిలీ చేయాలని ఆదేశించడం కలకలం రేపింది.

వీరితో పాటు రవాణా శాఖ కార్యదర్శి , ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌లను బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎక్సైజ్,వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశించింది. పనితీరు, సంబంధిత ఇన్‌పుట్ ఆధారంగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం .  ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశం సందర్భంగా పనితీరుపై సదరు అధికారులను హెచ్చరించారు సీఈసీ రాజీవ్ కుమార్ .

Latest Videos

ఈ నెల 3 నుంచి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖతో సమీక్ష సందర్భంగా పలువురు అధికారుల పనితీరుపై ఎన్నికల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే విపక్ష పార్టీలు కూడా కొందరు పోలీస్ అధికారుల పనితీరుపై ఫిర్యాదులు చేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం ఈసీకి వచ్చింది. ఈ క్రమంలోనే అధికారుల బదిలీలపై నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. 
 


 

click me!