telangana elections 2023 : నేడు తెలంగాణలో ప్రచారం చేయనున్న వివిధ పార్టీల అగ్రనేతలు.. ఎవరెవరు? ఎక్కడెక్కడా?

By SumaBala BukkaFirst Published Nov 27, 2023, 9:42 AM IST
Highlights

రేపటితో ప్రచారగడువు ముగియనుండడంతో బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన జాతీయ నాయకులంతా తెలంగాణలో మోహరించారు. ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువులు బడా నేతలు తెలంగాణలో ఉన్నారు. 

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ రణానికి ముచ్చటగా ముప్పై గంటల గడువు మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారం గడువు ఉంది. దీంతో ఈ సారి తెలంగాణలో అధికారం కోసం అన్ని పార్టీలూ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ‘ఔర్ ఏక్ దక్కా మూడోసారీ పక్కా’.. అంటూ బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తుండగా.. తెలంగాణ ఇచ్చి కూడా అభాసుపాలయ్యామన్న బాధలో కాంగ్రెస్ ఉంది. ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని రాహుల్, ప్రియాంక, ఖర్గేలాంటి బడానేతలంతా తెలంగాణలో మోహరించారు. ఇక మరోవైపు ప్రధాని మోడీతో సహా బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ రోజు ఎవరెవరు..ఎక్కడెక్కడ.. ప్రచారం చేస్తున్నారు? అంటే..

బీజేపీ నేతలంతా..

Latest Videos

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు తెలంగాణలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.  ఉదయం మహబూబా బాద్ లో,  మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్ లో జరిగే బహిరంగ సభల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.  ఈ సభల్లో ప్రసంగించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాదుకు చేరుకుంటారు.  సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు రోడ్ షోలో పాల్గొంటారు.  నేటితో ప్రధాని ప్రచారం తెలంగాణలో ముగుస్తుంది.  రోడ్ షో అనంతరం  ప్రధాని ఢిల్లీకి వెళ్లిపోతారు.

బిజెపి మరో ముఖ్య నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉదయం పదకొ పది గంటలకు హుజురాబాద్ బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత పెద్దపల్లిలో జరిగే రోడ్ షోలో ఉదయం 11 గంటలకు పాల్గొంటారు.  అక్క మంచిర్యాలలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. సోమవారం నాడు బిజెపి జాతి అధ్యక్షులు జేపీ నడ్డా కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.  ఉదయం 10 గంటలకు జగిత్యాల రోడ్ షోలో,  11 గంటలకు బోధన్ లో బహిరంగ సభ, మధ్యాహ్నం ఒంటిగంటకు బాన్సువాడలో బహిరంగ సభ,  మధ్యాహ్నం రెండున్నర గంటలకు జుక్కల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు.

బీజేపీ నేత, కేంద్ర మంత్రి మురళీధరన్ తెలంగాణలో అలంపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డోర్ టు డోర్ క్యాంపెన్లో పాల్గొంటారు మురళీధరన్. మరో బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ నేడు సిద్దిపేటలో పర్యటిస్తారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. హన్మకొండలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పర్యటించనున్నారు. ఆయన అక్కడ మేధావులతో భేటీ కానున్నారు. మరోవైపు  నేడు ఉదయం పదిగంటలకు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కర్ణాటక మాజీ సీఎం బసవరాజు బొమ్మై ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.

కాంగ్రెస్ నుంచి.. 
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు  ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు కూడా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రేపటితో తెలంగాణలో ముగియనుంది. ప్రియాంక గాంధీ నేడు మూడు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఉన్నారు ప్రియాంక గాంధీ. భువనగిరి,  గద్వాల్, కొడంగల్ నియోజకవర్గం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:30 కు కొడంగల్ లో జరిగే బహిరంగ సభల్లో  ప్రియాంక గాంధీ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

నర్సాపూర్ లో సాయంత్రం నాలుగున్నర గంటలకు ఏఎస్ఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. చత్తీస్గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ మధ్యాహ్నం 12:30 గంటలకు అదిలాబాద్ లో పర్యటిస్తారు. గాంధీభవన్ లో ఉదయం 11:30 గంటలకు రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. మాజీ కేంద్రమంత్రి ఎంపీ జయరాం రమేష్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ మధ్యాహ్నం మూడు గంటలకు గాంధీ  భవన్లో  ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. 

బీఆర్ఎస్ ప్రచారం ఇలా... 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  ముఖ్యమంత్రి కేసీఆర్  నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మరోవైపు కేటీఆర్  ముషీరాబాద్ నియోజకవర్గంలో  మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు.  మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం 9 గంటలకు  ఆటో యూనియన్ మీటింగ్ లో పాల్గొంటారు,  ఉదయం 10 గంటలకు పెద్దపల్లిలోని  సుల్తానాబాద్ లో రోడ్ షో,  11.30 గంటలకు ధర్మపురి వెలుగటూర్లో రోడ్ షో,  12:30 గంటలకు చెన్నూరులో రోడ్ షో,  మధ్యాహ్నం 1:30 గంటలకు హుజరాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు.  ఆ తరువాత ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 

ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులోని అంబర్పేట్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు అంబర్పేట డివిజన్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. 

click me!