telangana elections 2023 : నేడు తెలంగాణాలో పర్యటించనున్న అగ్రనేతలు వీరే...

By SumaBala BukkaFirst Published Nov 25, 2023, 10:52 AM IST
Highlights

ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీల వరకు పార్టీ అగ్ర నేతలు క్యూ కడుతున్నారు.  ప్రచారంతో దండోరా మోగిస్తున్నారు. తెలంగాణను రణక్షేత్రంగా మార్చేస్తున్నారు. తెలంగాణ పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సభలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రచారానికి ముచ్చటగా మూడు రోజులు మిగిలింది. దీంతో శుక్రవారం నుంచే అన్ని పార్టీల అగ్ర నేతలు తెలంగాణలో దిగారు. అన్ని పార్టీల ప్రముఖ నాయకులు, జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. తమ పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారానికి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు తెలంగాణలో ఎంత మంది ప్రముఖులు, ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారో సమగ్ర కథనం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తెలంగాణలో మూడు రోజులు గడపనున్నారు.  శనివారం 1.25 నిమిషాలకు దుండిగల్ విమానాశ్రయానికి వస్తారు ప్రధాని. అక్కడి నుంచి 2.05 ని.కు కామారెడ్డిలో జరిగే బిజెపి బహిరంగ సభకు చేరుకుంటారు. మూడు గంటల వరకు ఆ సభలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.05ని.కు రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటారు. 4.55వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7:35ని.లకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట్ నుంచి రోడ్డు మార్గాన రాజభవన్ కు చేరుకుని రాత్రికి రాజభవన్ లో బస చేస్తారు.

Latest Videos

KCR: 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఆత్మహత్యలు, వలస‌ల‌తో నిండిపోయింది.. కేసీఆర్ ఫైర్

బిజెపికి చెందిన మరో ముఖ్య నేత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తెలంగాణలో నేడు పర్యటించనున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ బిజెపి అభ్యర్థి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కు మద్దతుగా  కాగజ్నగర్లో పర్యటిస్తున్నారు.  హరీష్ బాబు ఏర్పాటు చేసిన రామ రాజ్య స్థాపన సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.  పలువురు కేంద్ర మంత్రులు కూడా  ఈ కార్యక్రమానికి దారులున్నారు. సీఎం యోగిత్యానాథ్ మధ్యాహ్నం 12:30 గంటలకు సిరిపూర్  బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. హైదరాబాద్ లో జరిగే సభలో అమిత్ షా పాల్గొంటారు. 

 కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ కూడా శుక్రవారం నుంచి తెలంగాణలో పర్యటిస్తున్నారు. శనివారం నాడు ఆమె పాలేరు, సత్తుపల్లిలో పర్యటిస్తారు.  పాలేరులో 11 గంటలకు ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తరువాత 1:30 కు సత్తుపల్లిలో కార్నర్ మీటింగ్, 2.40కి మధిరలో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తరువాత విజయవాడకు చేరుకుని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. 

వీరితోపాటు రాష్ట్ర నాయకులు, వివిధ పార్టీల ఆగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నేడు జుక్కల్, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రత్యేకంగా కార్నర్ మీటింగ్లతో,  తమ ఆరు గ్యారెంటీలు జనాలకు గుర్తుండిపోయేలా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

తెలంగాణలో బిజెపి-జనసేన పొత్తుతో  ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.  దీంట్లో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు.  ఇప్పటి దుబ్బాక,  కొత్తగూడెం,  సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్.. శనివారం నాడు నిజ వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు.  అక్కడ జనసేన తరఫున వేమూరి శంకర్ గౌడ్  పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థి తరఫున తాండూరులో పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు.

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కేటీఆర్,  హరీష్ రావులు కూడా  రాష్ట్రవ్యాప్తంగా పలు సభల్లో పాల్గొననున్నారు.
 

click me!