telangana elections 2023 : హైదాబాద్ పాతబస్తీ బడా వ్యాపారుల టార్గెట్ గా ఐటీ సోదాలు...

By SumaBala Bukka  |  First Published Nov 25, 2023, 8:36 AM IST

హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కోహినూర్ కింగ్స్ గ్రూపుల పేరుతో హోటల్స్, ఫంక్షన్ హాల్స్ నిర్వహిస్తున్న వ్యాపారవేత్తల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు అతి సమీపంలోకి వచ్చింది. కానీ, ఐటీ రైడ్స్ ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఒకచోట ఐటీ రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్ గా ఐటీ రైడ్స్ మొదలయ్యాయి. శనివారం తెల్లవారు జామున 4. గంటల నుంచి వివిధ బృందాలుగా ఏర్పడి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లుగా ఐటి శాఖకు సమాచారం అందడంతో ఐటీ దాడులకు పాల్పడింది. 

ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగనున్నట్లు సమాచారం. పాతబస్తీతో పాటు హైదరాబాద్ శాస్త్రిపురంలోనూ ఐటీ దాడులు చేస్తున్నాయి. కోహినూర్ గ్రూప్స్ ఎండి మజీద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. వ్యాపారి శానవాజ్ తో  పాటు పలువురు ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. కోహినూర్ కింగ్స్ గ్రూపుల పేరుతో హోటల్స్, ఫంక్షన్ హాల్స్ నిర్వహిస్తున్న వ్యాపారవేత్తల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఐటీ శాఖ అధికారులతో పాటు సిఐఎస్ఎఫ్  కూడా ఈ రైడ్స్ లో ఉన్నారు. పాతబస్తీ బడా వ్యాపారులను టార్గెట్ గా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Latest Videos

click me!