ఎంతలో వుండాలో అంతలో వుండు.. అన్నీ నీకెందుకమ్మా : తమిళిసైపై సీపీఐ నేత కూనంనేని వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 10, 2022, 2:31 PM IST
Highlights

గవర్నర్ ఎంతలో వుండాలో, అంతలోనే వుండాలన్నారు తెలంగాణ సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. గవర్నర్ తమిళిసై తనకు మించిన పనులు చేస్తోందని , గవర్నర్ వ్యవస్థ ప్రజలకు అస్సలు పనికి రాదన్నారు . 
 

తెలంగాణ గవర్నర్ తమిళిసై పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫైరయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ఎంతలో వుండాలో, అంతలోనే వుండాలన్నారు. ఇది విమోచనమో, విలీనమో గవర్నర్‌కు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తోందని , గవర్నర్ వ్యవస్థ ప్రజలకు అస్సలు పనికి రాదన్నారు . సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా డిక్లేర్ చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. 

అంతకుముందు సీపీఐ నారాయణ సైతం గవర్నర్ తమిళిసైపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటారని.. అదానీ, అంబానీలపై గవర్నర్ తమిళిసై ఎందుకు మాట్లాడరని నారాయణ ప్రశ్నించారు. రాజకీయాలు చేసే ఏ గవర్నరైనా పనికిమాలిన గవర్నరేనని.. తమిళిసైని వెంటనే రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే.. అసభ్యంగా వున్నందునే బిగ్‌బాస్‌ను విమర్శించానని ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. బిగ్‌బాస్‌లో మహిళలను కించపరిచేలా ప్రసారం చేస్తున్నారని.. చిరంజీవికి, నాగార్జునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుందని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. నాగార్జున డబ్బు కోసం కక్కుర్తి పడతారని ఆయన ఆరోపించారు.

ALso REad:ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడి మాదిరే గవర్నర్ కూడా... సీఎంకే పవర్ ఎక్కువ : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

అలాగే గవర్నర్ పదవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... గవర్నర్ పదవి కంటే సీఎం పోస్టుకే పవర్ ఎక్కువన్నారు. గవర్నర్ పోస్టు నామినేటెడ్ పోస్ట్ అన్న ఆయన.. ఎమ్మెల్సీ, రాజ్యసభ పోస్టులతో గవర్నర్ పదవి సమానమని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం టీఆర్ఎస్, గవర్నర్ బీజేపీ కాబట్టే సమస్యలని ఆయన అభిప్రాయపడ్డారు. 

అంతకుముందు తమిళిసై సౌందర రాజన్ మాటల్లో నిరాశ కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు.  గురువారం నాడు ఆయన మీడియాతో  మాట్లాడారు. గవర్నర్ ఇంతలా చెబుతున్నా ప్రభుత్వం స్పందించదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పై అమిత్ షాకు నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆయన గవర్నర్ కు సూచించారు.

click me!