తొలుత తెలంగాణ ప్రజలకు న్యాయం చేశాక.. దేశ రాజకీయాల గురించి ఆలోచించు: కేసీఆర్‌పై పొన్నం ప్రభాకర్ ఫైర్

By Sumanth KanukulaFirst Published Sep 10, 2022, 1:55 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం చేసిన తర్వాత దేశం గురించి ఆలోచించాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. మొదటి నుంచి బీజేపీకి మద్దతిచ్చిన పార్టీ టీఆర్ఎస్‌‌ అని.. బీజేపీకి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని చెప్పారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం చేసిన తర్వాత దేశం గురించి ఆలోచించాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. మొదటి నుంచి బీజేపీకి మద్దతిచ్చిన పార్టీ టీఆర్ఎస్‌‌ అని.. బీజేపీకి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని చెప్పారు. గాంధీభవన్‌లో శనివారం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన భజన బృందం అహా హోహో అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ.. ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాత కేసీఆర్.. దేశ రాజకీయాల గురించి మాట్లాడాలని అన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. గతంలో కాంగ్రెస్ హయాంలో తెచ్చినవేనని అన్నారు. కేసీఆర్ తెలంగాణను అప్పులమయం , అవినీతి మయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పొలం దున్నినోడిని, దున్ననోడిని అందరినీ సమానం చేసే పరిస్థితిని కేసీఆర్ తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వ పథకాల నిధులు తమవంటే, తమవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు. 

Also Read: మునుగోడు బై పోల్ 2022: రేవంత్ రెడ్డితో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి భేటీ..

టీఆర్ఎస్‌ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేసే ముందు ఆలోచించాలన్నారు. కేసీఆర్ ముచ్చట అక్బర్ బీర్బల్ కథలా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తొలుత ఇంట గెలిచి..  ఆ తర్వాత రచ్చ గెలిచే ప్రయత్నం చేయాలని సూచించారు. మునుగోడు సీటు తామే దక్కించుటామని చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి తాను కూడా వెళ్తానని తెలిపారు. 

click me!