Telangana Corona Cases:మళ్లీ కరోనా కలకలం... నిన్న ఇద్దరు టీచర్లు, నేడు నలుగురు స్టూడెంట్స్ కు పాజిటివ్

By Arun Kumar PFirst Published Nov 11, 2021, 10:53 AM IST
Highlights

తెలంగాణలో మళ్ళీ మెల్లిమెల్లిగా కరోనా కలవరం మొదలవుతోంది. ఇప్పటికే ఇద్దరు టీచర్లు కరోనాబారిన పడ్డట్లు వెలుగుచూడగా తాజాగా మరో నలుగురు స్టూడెంట్స్ కు ఈ వైరస్ సోకింది. 

భూపాలపల్లి: తెలంగాణలోని మళ్లీ కరోనా కలకలం మొదలయ్యింది. దాదాపు గత రెండేళ్లుగా మూతపడ్డ విద్యాసంస్థలు కొద్దిరోజుల క్రితమే తెరుచుకోగా భయంభయంగానే తమ పిల్లలను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపిస్తున్నాయి. వారి భయాన్ని పెంచేలా స్కూళ్ళలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా బారినపడగా తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.   

jayashankar bhupalapalli district లోని కాటారం బాలుర ఎస్టీ గురుకుల  పాఠశాలలో కరోనా టెస్టులు నిర్వహించారు. స్కూల్లోని అందరు విద్యార్థులకు టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో మిగతా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. 

ప్రస్తుతం corona positive గా నిర్దారణ అయిన నలుగురు విద్యార్థులను క్వారంటైన్ లో వున్నారు. సదరు విద్యార్థులు కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులకు కూడా కరోనా టెస్టులు చేయడానికి వైద్యాధికారులు సిద్దమయ్యారు. 

read more   24 గంటల్లో 106 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,72,052కి చేరిన మొత్తం కరోనా కేసులు

karimnagar district తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కూడా ఇటీవల కరోనా కేసులు వెలుగుచూసాయి. ఈ పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులకు corona positive గా నిర్దారణ అయ్యింది. తాజాగా భూపాలపల్లి జిల్లాలో కూడా కరోనా కేసులు వెలుగుచూడటం మరింత భయాందోళనను రేపుతోంది.

కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యార్థుల చదువులు అస్తవ్యస్తంగా మారాయి. విద్యాసంస్థల పరిస్థితి కూడా దారుణంగా మారింది. అయితే ఇప్పుడిప్పుడే విద్యార్థుల చదువులు, విద్యాసంస్థలు గాడిన పడుతున్న సమయంలో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. 

ఇదిలావుంటే తెలంగాణలో గత 24గంటల్లో(09.11.2021 మంగళవారం సాయంత్రం 5గంటల నుండి 01.11.2021 బుధవారం సాయంత్ర 5గంటల వరకు) 38,242మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 164 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 55 corona positive cases నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల,  కామారెడ్డి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 

ఇదే సమయంలో 171మంది కరోనా నుంచి కోలుకోగా (corona deaths in telangana) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,72,987కి చేరుకుంది.  6,65,272  మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో 3,746 యాక్టీవ్ కేసులు వున్నాయి. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,969కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 55, జగిత్యాల 4, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 10, ఖమ్మం 9, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 3, మంచిర్యాల 3, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 4, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 4, సిరిసిల్ల 3, రంగారెడ్డి 10, సిద్దిపేట 4, సంగారెడ్డి 7, సూర్యాపేట 1, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 7, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

click me!