జనగామలో ఘోరం: 105మంది విద్యార్థులతో కూడిన బస్సును ఢీకొన్న లారీ... ఇద్దరి పరిస్థితి విషమం

By Arun Kumar PFirst Published Nov 11, 2021, 9:59 AM IST
Highlights

105మంది విద్యార్థులకు వెళుతున్న ఆర్టీసి బస్సులు మితిమీరిన వేగంతో వెనకవైపునుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. జనగామ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 

జనగామ: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులతో వెళుతున్న TSRTC కి చెందిన బస్సును వెనకనుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 105మంది విద్యార్థులు వుండగా వీరిలో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... janagaon bus depot కు చెందిన ఆర్టిసి బస్సు వెల్ది ఆదర్శ పాఠశాల విద్యార్థులతో వెలుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. hyderabad-warangal జాతీయ రహదారిపై వెళుతుండగా రఘునాధపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వెనకనుండి మితిమీరిన వేగంతో వచ్చిన ఓ లారీ అదుపుతప్పి బస్సులు ఢీకొట్టింది. 

ప్రమాద సమయంలో బస్సులో 105మంది విద్యార్థులు వున్నారు. అయితే వీరంతా తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అయితే బస్సు డ్రైవర్ ఉప్పలయ్య, కండక్టర్ లీలతో పాటు తొమ్మిదిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

READ MORE  పెళ్లైన నెల రోజులకే విషాదం: హైద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడిన విద్యార్థులకు వరంగల్ ఎంజిఎంకు తరలించారు. ఇక ఆర్టిసి సిబ్బంది జనగామ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలపాలైన విద్యార్థులకు ఘటనా స్థలంలోనే ప్రథమచికిత్స అందించారు. విద్యార్థులకు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పరామర్శించడమే కాదు స్వయంగా వైద్యం అందించారు.   

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణమయి వుంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో వున్నట్లు తెలిపారు. లారీ గుద్దడంలో బస్సు వెనకబాగం నుజ్జునుజ్జయ్యింది. ఇలా తరచూ జరుగుతున్న రోడ్డుప్రమాదాలు విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

READ MORE  రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు...

ఇదిలావుంటే ఇటీవల ఇదే జనగామ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో 10మంది ప్రయాణికులతో పాటు బస్ డ్రైవర్, కండక్టర్ కు గాయాలయ్యాయి. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి TSRTC కి చెందిన Bus ప్రయాణికులతో జగద్గిరిగుట్టకు బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో  చిల్పూర్ మండలం కొండాపూర్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. బస్సు బోల్తాపడినప్పటికి ప్రయాణికులెవ్వరూ పెద్దగా గాయపడలేదు. బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు 10మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. 

ఓవైపు తెలంగాణ ఆర్టిసిని చక్కదిద్దేందుకు ఇటీవలే ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఓవైపు ప్రయత్నిస్తుంటే తరచూ బస్సులు ప్రమాదానికి గురవుతూ ప్రయాణికుల భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో ముందుగా ప్రమాదాల నివారణకు నివారణకు తగు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు ఆర్టిసి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిసి యాజమాన్యం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది.  

ఇక ఆర్టిసి బస్టాండ్‌లలో అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయో..? లేదో..? తెలుసుకోవడానికి స్వయంగా సజ్జనార్ రంగంలోకి దిగారు.  హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్ అక్కడి బస్టాండ్ తనిఖీలు చేపట్టారు.  

 
 

 


 

click me!