తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 12 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 1,414 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 33,514కి చేరింది. వీరిలో 22,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 598 కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా.. హైద్రాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిని కేవలం కరోనా రోగులకు చికిత్స అందించేందుకు కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో గాంధీ ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరిగింది. ప్రతి 10 నిమిషాలకు ఒక కోవిడ్ రోగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తున్నాడని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం కరోనాతో పాటు ఇతర రోగాలకు కూడా ఈ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే గత ఏడాదిలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకే కేటాయించారు. ఇటీవలనే కరోనాతో పాటు ఇతర వ్యాధులకు కూడ చికిత్స అందించడం ప్రారంభించారు. అయితే మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు నిర్ణయం తీసుకొన్నారు.
నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్స్ నిండిపోయాయి. టిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే సగం బెడ్స్ నిండిపోయాయి. గాంధీ ఆసుపత్రిలో1100 బెడ్స్ ఉన్నాయి. వీటిలో 400 బెడ్స్ కు ఆక్సిజన్ ఉంది. అయితే ఆక్సిజన్ పౌకర్యం ఉన్న బెడ్స్ సంఖ్యను కూడ పెంచాలని వైద్య శాఖాధికారులు నిర్ణయించారు.కరోనా కాకుండా ఇతర రోగాల చికిత్స కోసం వచ్చినవారిని ఉస్మానియా లేదాఇతర ఆసుపత్రులకు వెళ్లాలని డాక్టర్లు సూచించారు.