దారుణం : మహిళను జుట్టుపట్టి లాగి చితకబాది.. అడ్డొచ్చిన వ్యక్తి తలపగలగొట్టి...

Published : Apr 17, 2021, 10:15 AM IST
దారుణం : మహిళను జుట్టుపట్టి లాగి చితకబాది.. అడ్డొచ్చిన వ్యక్తి తలపగలగొట్టి...

సారాంశం

ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత అవగాహన కల్పించిన దళితులను చూసే దృష్టిలో మార్పు రావడం లేదు. వారిమీద జరిగే దాడులు ఆగడం లేదు. ఇలాంటి అమానుష ఘటన ఒకటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. 

ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత అవగాహన కల్పించిన దళితులను చూసే దృష్టిలో మార్పు రావడం లేదు. వారిమీద జరిగే దాడులు ఆగడం లేదు. ఇలాంటి అమానుష ఘటన ఒకటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. 

ఓ దళిత మహిళను జుట్టుపట్టుకుని కొట్టడమే కాకుండా.. ఆపబోయిన వ్యక్తి మీద దాడి చేశాడో వ్యక్తి. దీనిమీద దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బండారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగరాజు పల్లి శివారు పంతులు పల్లి గ్రామానికి చెందిన ఉప్పల నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ దళిత మహిళను జుట్టు పట్టి లాగి కొడుతూ అవమానించాడు.

ఈ సంఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన చుక్క సాంబయ్యపై కర్రలతో దాడి చేశాడు. దీంతో సాంబయ్య తలకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?