
తెలంగాణలో పోలీసు అధికారుల ఆత్మహత్యల పంరపర కొనసాగుతోంది.
గత ఏడాది ఆగస్టులో ఇదే పోలీసు స్టేషన్ లో రామకృష్ణారెడ్డి అనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆయన ఆత్మహత్య ఘటన మరవకముందే మరో ఎస్సై తనువు చాలించారు.
రామకృష్ణారెడ్డి కాల్చుకుని చనిపోయిన గదిలోనే ప్రభాకర్ రెడ్డి కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఉన్నతాధికారుల వేధింపులే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రభాకర్ రెడ్డి సొంతూరు యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామం. 2012 బ్యాచ్ కు చెందిన ప్రభాకర్ రెడ్డికి గత రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. భార్యత డెలివరీ కారణంగా సెలవుపై వెళ్లిన ఆయన ఇటీవలే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఒకే పోలీసు స్టేసన్ లో పనిచేస్తున్న ఎస్సైలు వరుసగా ఆత్మహత్యకు పాల్పడడం పట్ల పోలీసు వర్గాలు కలవరపాటుకు గురవుతున్నాయి.