T Congress: రేపటి నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర షురూ.. వివరాలివే

By Mahesh K  |  First Published Oct 27, 2023, 7:55 PM IST

కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్రను రేపటి నుంచి కొనసాగించనుంది. రేపు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరగనున్న యాత్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరై మాట్లాడుతారు.
 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గణనీయంగా పుంజుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్‌తో బలంగా ఢీకొట్టే పార్టీ కాంగ్రెస్‌గానే ఎదిగింది. అసంతృప్తులను బుజ్జగిస్తూ కొత్త నేతలను చేర్చుకుంటూ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతూ ప్రచారంలోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. తెలంగాణలో కాంగ్రెస్‌కు మెరుగైన పరిస్థితులు కనిపించడంతో అధిష్టానం పూర్తి ఫోకస్ తెలంగాణ పై పెట్టింది. అందుకే తరుచూ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వంటి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బస్సు యాత్ర తొలి విడతను ముగించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, రెండో విడత బస్సు యాత్రను రేపు ప్రారంభిస్తున్నది.

ఏడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర సాగనుంది. ఈ యాత్రలోనూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు పాల్గొనబోతున్నారు. తొలి రోజున కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొనబోతున్నారు. అంటే, రేపు నిర్వహించబోతున్న కాంగ్రెస్ బస్సు యాత్రలో డీకే శివకుమార్ పాల్గొని మాట్లాడబోతున్నారు. మరుసటి రోజే అంటే ఎల్లుండి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొనబోతున్నారు.

Latest Videos

undefined

Also Readపాలేరు స్థానంలో ఉత్కంఠ రాజకీయం.. హుజురాబాద్ బైపోల్ హీట్ రిపీట్?

తొలి రోజున కాంగ్రెస్ బస్సు యాత్ర చేవెళ్ల పార్లమెంటు పరిధిలో తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో సాగుతుంది. రెండో రోజున మెదక్ పార్లమెంటు పరిధిలోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్‌లలో బస్సు యాత్ర ఉంటుంది. మూడో రోజున భువనగిరి పార్లమెంటు పరిధిలో జనగామ, ఆలేరు, భువనగిరి లో బస్సు యాత్ర సాగుతుంది. 

ఇక నాలుగో రోజున నల్గొండ, నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో నాగార్జున సాగర్, కొల్లాపూర్‌ లలో, ఐదో రోజున నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని జడ్చర్ల, షాద్ నగర్‌లలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఆరో రోజున మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజి గిరిలో కాంగ్రెస్ బస్సు యాత్ర సాగుతుంది.

click me!