బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ మరో అమరావతే : హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 27, 2023, 7:30 PM IST

బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాకపోతే .. హైదరాబాద్ మరో అమరావతిలా మారుతుందేమోనని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 


బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాకపోతే .. హైదరాబాద్ మరో అమరావతిలా మారుతుందేమోనని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో అభివృద్ధి రజనీకాంత్‌కు అర్ధమైందని.. కానీ ఇక్కడి గజనీలకు మాత్రం అర్ధం కావడం లేదని హరీశ్ రావు చురకలంటించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో సూపర్‌ హిట్ కాబట్టే కేసీఆర్ భరోసా అని పేరు పెట్టుకున్నామని.. రైతుబంధు రూ.3 వేల కోట్లే బ్యాలెన్స్ వుందని మంత్రి చెప్పారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రాగానే 100 శాతం రైతుబంధును అందజేస్తామని హరీశ్ తెలిపారు. 

Also Read: ఎవరికి ఎవరు అన్యాయం చేశారు: పాలేరులో తుమ్మలకు కేసీఆర్ కౌంటర్

Latest Videos

ఎవరెన్ని ట్రిక్కులు ప్లే చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను కొందరు గోబెల్స్ ప్రచారానికి వాడుకుంటున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ల ముందు కనిపిస్తోన్న అభివృద్ధిని నమ్మాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 30 రోజులు మనమంతా కష్టపడితే కేసీఆర్, మీ ఎమ్మెల్యే మనకు మళ్లీ సేవ చేస్తారని హరీశ్‌రావు తెలిపారు. అభ్యర్ధులను అమ్ముకుంటున్న కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముతుందని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్‌ది అభివృద్ధి ఎజెండా.. కాంగ్రెస్‌ది బూతుల ఎజెండా అని మంత్రి వ్యాఖ్యానించారు. బీజేపీ డక్ ఔట్.. కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ సెంచరీ చేస్తారని హరీశ్‌రావు తెలిపారు. 

click me!