కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ భేటీ: కీలక విషయాలపై చర్చ

Published : Jul 10, 2022, 12:48 PM ISTUpdated : Jul 10, 2022, 01:08 PM IST
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ భేటీ: కీలక విషయాలపై చర్చ

సారాంశం

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో ఆదివారం నాడు మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు లంచ్ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీలో చేరికల విషయమై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మాణికం ఠాగూర్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. 


హైదరాబాద్: Bhuvanagiri ఎంపీ Komatireddy Venkat Reddy నివాసంలో ఆదివారం నాడు మధ్యాహ్నం  Congress నేతల లంచ్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పార్టీలో చేరికల విషయమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ Manickam Tagore ,  టీపీసీసీ చీఫ్ Revanth Reddy , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

రెండు రోజుల క్రితం Hyderabad కు వచ్చిన  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  మాణికం ఠాగూర్ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరికల విషయమై నేతలు ఎవరూ కూడా అభ్యంతరం చెప్పొద్దని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత Rahul gandhi  ఆదేశాల మేరకే పార్టీలో చేరికలు సాగుతున్నాయని మాణికం ఠాగూర్ చెప్పారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే Erra Shekar  కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. మరో వైపు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో డాక్టర్ Ravi kumar  ను పార్టీలో చేర్చుకోవడంపై తుంగతుర్తి నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అద్దంకి దయాకర్ తీవ్రంగా తప్పు బడుతున్నారు. ఈ విషయమై ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు డాక్టర్ రవికుమార్ కు మద్దతుగా నిలుస్తున్నారు.ఈ విషయమై అద్దంకి దయాకర్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 

ఆదివారం నాడు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు ఈ లంచ్ భేటీకి హాజరు కానున్నారు. ఈ సమావేశం లో ప్రధానంగా పార్టీలో చేరికలపై చర్చించే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయమై తీసుకోవాల్సిన చర్యలపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ సూచనలు, సలహాల ఆధారంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చర్చించే అవకాశం ఉంది.

ఇవాళ సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో పీఏసీ  సభ్యులకు మహేష్ కుమార్ గౌడ్  విందు ఇవ్వనున్నారని సమావేశం. ఈ సమావేశంలో కూడా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయమై నేతలు చర్చించే అవకాశం లేకపోలేదు. 

also read:చేరికలను అడ్డుకోవద్దు.. రాహుల్ ఆదేశం, హద్దుమీరితే చర్యలు తప్పవు : టీ.కాంగ్రెస్ నేతలకు ఠాగూర్ వార్నింగ్

తెలంగాణలో బీజేపీ దూకుడును పెంచింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది.ఈ ప్రచారాన్ని వెనక్కి నెట్టి రాష్ట్రంలో తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు గాను కాంగ్రెస్ నేతలు వ్యూహా రచన చేస్తున్నారు.  అయితే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మధ్యే సమన్వయం లేదు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకకుంటున్నారు.ఈ తరహా విమర్శలతో పార్టీపై ప్రజల్లో చులకన భావం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయమైపార్టీ నాయకత్వం కూడా వార్నింగ్ ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు
Syrup: మీ ఇంట్లో ఈ సిర‌ప్ ఉందా? వెంట‌నే బ‌య‌ట‌ ప‌డేయండి.. తెలంగాణ ప్ర‌భుత్వం అల‌ర్ట్‌