హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని మిస్సింగ్.. తల్లిదండ్రుల ఆందోళన..

Published : Jul 10, 2022, 12:19 PM ISTUpdated : Jul 10, 2022, 12:22 PM IST
హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని మిస్సింగ్.. తల్లిదండ్రుల ఆందోళన..

సారాంశం

హైదరాబాద్‌లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అదృశ్యమైంది. కాలేజ్‌ను వెళ్లిన విద్యార్థి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో  తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

హైదరాబాద్‌లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అదృశ్యమైంది. కాలేజ్‌ను వెళ్లిన విద్యార్థి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో  తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. వర్షిణి అనే విద్యార్థిని నగర శివార్లలోని కండ్లకోయలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుతుంది. ఇటీవల ఆమె మిడ్ ఎగ్జామ్‌ కోసం కాలేజ్‌కు వెళ్లింది. వర్షిణిని ఆమె సమీప బంధువు ఒకరు కాలేజ్ వద్ద డ్రాప్ చేశారు. అయితే తర్వాత ఐడీ కార్డు, మొబైల్ ఇంట్లో మరిచిపోయానని ఆమె కాలేజ్‌ నుంచి బయటకు వచ్చింది. అయితే కాలేజ్‌కు వెళ్లిన వర్షిణి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. 

వర్షిణి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. వర్షిణి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలేజ్‌ సమీపంలో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. వర్షిణి కాలేజ్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. అయితే అక్కడి నుంచి ఆమె ఎటూ వెళ్లిందనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక,  వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చివరిగా ముంబై‌లో ఓపెన్ అయినట్టుగా పోలీసులను గుర్తించారు.  

ఇక, వర్షిణిని ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు ఆచూకీని కనుగోవాలని పోలీసులను వేడుకుంటున్నారు. రోజులు గడస్తున్న వర్షిణి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?