మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర, బైక్ ర్యాలీలపై చర్చ: ప్రారంభమైన తెలంగాాణ బీజేపీ కోర్ కమిటీ భేటీ

By narsimha lode  |  First Published Jul 10, 2022, 12:04 PM IST

బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఆదివారం నాడు హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైంది.రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర, మోటార్ బైక్ ర్యాలీలపై చర్చించనున్నారు. 


హైదరాబాద్: మూడో విడత Praja Sangrama Yatra, నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించే విషయంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు గాను Telanganaకు చెందిన BJP కోర్ కమిటీ సమావేశం ఆదివారం నాడు ప్రారంభమైంది. కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.  ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ Tarun Chugh కూడా హాజరయ్యారు. 15 రోజలకు ఒకసారి బీజేపీ కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.దీంతో ఇవాళ కోర్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించే విషయమై  కూడా కోర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభించాలి, ఎక్కడి నుండి యాత్ర కొనసాగించాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరో వైపు రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహించాలని కూడా బీజేపీ నాయకత్వం భావిస్తుంది.  బీజేపీకి చెందిన సుమారు 10 మంది కీలక నేతలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, మరో వైపు నియోజకవర్గాల్లో బీజేపీ ముఖ్య నేతల Bike Rallies లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై  కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని కూడా బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది.

Latest Videos

undefined

also read:బండి సంజయ్ ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించిన తెలంగాణ సర్కార్

పోడు భూముల విషయమై గిరిజనులు, అటవీశాఖాధికారుల మధ్య ప్రతి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో  పోడు భూముల సమస్యలపై Nizambad  కేంద్రంగా ఒక్క రోజు పాటు దీక్ష చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు.ఈ  నెల 11న నిజామాబాద్ లో దీక్ష చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు.  దీంతో రాష్ట్రంలో ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరే నాయకుల విషయమై కూడా చర్చించే అవకాశం ఉంది. బీజేపీలో చేరికల కమిటీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ చైర్మెన్ గా ఉన్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలతో బీజేపీ చేరికల కమిటీ నేతలు చర్చించే అవకాశం ఉంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 2,3 తేదీల్లో హైద్రాబాద్ లో జరిగాయి.ఈ నెల 3న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకొని  బహిరంగ సభను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ పార్టీ కీలక నేతలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశాల్లో దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని కూడా  బీజేపీ నాయకత్వం ధీమాను వ్యక్తం చేసింది.ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.  ఈ దిశగానే తెలంగాణ బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తుంది. 
 

click me!