84 మందిలో 30 మందే హాజరు.. టీపీసీసీ ఉపాధ్యక్షులకు మాణిక్ రావు థాక్రే క్లాస్, తప్పిస్తానంటూ వార్నింగ్

Siva Kodati |  
Published : Feb 15, 2023, 05:23 PM IST
84 మందిలో 30 మందే హాజరు.. టీపీసీసీ ఉపాధ్యక్షులకు మాణిక్ రావు థాక్రే క్లాస్, తప్పిస్తానంటూ వార్నింగ్

సారాంశం

టీపీసీసీ ఉపాధ్యక్షులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు థాక్రే. బుధవారం నిర్వహించిన సమావేశానికి 84 మందిలో కేవలం 30 మంది ఉపాధ్యాక్షులు మాత్రమే హాజరుకావడంతో ఆయన ఫైర్ అయ్యారు.   

టీపీసీసీ ఉపాధ్యక్షులకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు థాక్రే క్లాస్ పీకారు. ఉపాధ్యక్షులతో సమావేశానికి ఆయన అందరికీ ఆహ్వానం పంపారు. అయితే 84 మందిలో కేవలం 30 మంది ఉపాధ్యాక్షులు మాత్రమే సమావేశానికి హాజరుకావడంతో థాక్రే సీరియస్ అయ్యారు. అలాగే పార్టీ అప్పగించిన పనులు చేయకపోవడం, జిల్లాలకు వెళ్లకపోవడం వంటి అంశాలపైనా మాణిక్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటితే తప్పించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పార్టీ సమావేశాలకు ఖచ్చితంగా హాజరుకావాలని మాణిక్ రావు థాక్రే స్పష్టం చేశారు. త్వరలో తెలంగాణ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని మాణిక్ రావు .. నేతలకు పలు లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు హాత్ సే హాత్ జోడో యాత్రలో ఖచ్చితంగా పాల్గొనాలని ఆదేశించారు. కానీ నేతలు అటు పక్క తొంగిచూడకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

ఇదిలావుండగా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందంటూ ఆ పార్టీ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ మాణిక్ రావు థాక్రే స్పందించారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. అలాగే వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని థాక్రే స్పష్టం చేశారు. పొత్తులపై రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పిందే తమకు ఫైనల్ అని ఆయన పేర్కొన్నారు. వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకున్నాకే స్పందిస్తానని మాణిక్ రావు థాక్రే వెల్లడించారు. 

Also REad: బిజెపికి విరుగుడు: రేవంత్ రెడ్డి హిందూత్వ ఎజెండా

ఇదే అంశంపై నిన్న మాణిక్ థాక్రేతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలోని లాంజ్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నే తాను ఇప్పుడు చెప్పినట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి ఎవరితోనూ పొత్తు వుండదని వెంకట్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న నాయకులు కూడా తనను తిట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు నా వ్యాఖ్యల్ని రాజకీయం చేస్తున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో హంగ్ వస్తుందని తాను అనలేదని ఆయన పేర్కొన్నారు.  తాను ఏ కమిటీలోనూ లేనని.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి తాను నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని కోమటిరెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్‌తో పొత్తు వుంటుందని కూడా తాను చెప్పలేదని.. తన వ్యాఖ్యలు అర్ధం అయ్యే వాళ్లకు అర్ధం అవుతాయని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!