హైద్రాబాద్ పురానాపూల్ ‌కూలర్ల గోడౌన్ లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

By narsimha lode  |  First Published Feb 15, 2023, 4:18 PM IST

హైద్రాబాద్ నగరంలో  ఇటీవల కాలంలో  అగ్ని ప్రమాదాలు  ఎక్కువగా చోటు  చేసుకుంటున్నాయి.  పురానాపూల్ లోని  ఎయిర్ కూలర్ల గోడౌప్ లో  ఇవాళ అగ్ని ప్రమాదం  జరిగింది. 


హైదరాబాద్:  నగరంలోని  పురానాపూల్ లో   బుధవారంనాడు అగ్ని ప్రమాదం  జరిగింది.   కూలర్ల గోడౌన్ లో  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది  కూలర్ల కంపెనీ  సిబ్బంది అగ్నిమాపక  సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  ఘటన స్థలానికి  చేరుకొని  ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. కూలర్ల గోడౌన్  అగ్ని ప్రమాదంతో  భారీగా మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా   పొగ కమ్ముకుంది.  ఆరు ఫైరింజన్లు  మంటలను ఆర్పుతున్నాయి. కూలర్ల గోడౌన్  పక్కనే  ఉన్న ఫర్నీచర్ దుకాణానికి  కూడా మంటలు వ్యాపించాయి.  

హైద్రాబాద్ నగరంలో  ఇటీవల కాలంలో  అగ్ని ప్రమాదాలు ఎక్కువగా  జరుగుతున్నాయి. జనావాసాల మధ్యే అగ్ని ప్రమాదాలు చోటు  చేసుకోవడంతో స్థానికులు  ఆందోళనలు చెందుతున్నారు.  అగ్ని ప్రమాదాలతో  పలువురు మృత్యువాత పడిన ఘటనలు కూడా  హైద్రాబాద్  నగరంలో  చోటు  చేసుకున్నాయి.   ప్రమాదాలు  జరిగిన సమయంలోనే కాకుండా  ప్రమాదాలు  జరగకుండా  చర్యలు తీసుకోవాలని  ప్రజలు కోరుతున్నారు. జనావాసాల మధ్య గోడౌన్లు,  చిన్న  చిన్న  వ్యాపార సంస్థలు ఏర్పాటు  చేయడం కూడా ప్రమాదాలకు  కారణంగా  అధికారులు చెబుతున్నారు. 

Latest Videos

undefined

  హైద్రాబాద్ నగరంలోని  మైలార్ దేవ్ పల్లిలోని టాటానగర్ లో  కారు  మెకానిక్ షెడ్డులో  ఈనెల  7వ తేదీన  అగ్ని ప్రమాదం  జరిగింది. ఈ నెల  4వ తేదీన  రామాంతపూర్ లోని  ఫర్నీచర్ గోడౌన్ లో  షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. 

ఈ నెల 3వ తేదీన  తెలంగాణ సచివాలయంలో  అగ్ని ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో  అగ్ని ప్రమాదం కలకలం రేపింది.  సచివాలయంలో  ఉడ్ వర్క్స్  జరుగుతున్న సమయంలో  అగ్ని ప్రమాదం జరిగింది.  11 ఫైరింజన్లు మంటలను ఆర్పాయి. ఈనెల  2వ తేదీన  చిక్కడపల్లిలోని  గోడౌన్ లో  మంటలు వ్యాపించాయి .

also read:విశాఖ గాజువాక హెచ్‌పీసీఎల్ లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

గత నెల 26వ తేదీన  డెక్కన్  మాల్ లో  అగ్ని ప్రమాదం  జరిగింది.  ఈ మాల్ లో అగ్ని ప్రమాదం కారణంగా  ఆరు అంతస్థులు దెబ్బతిన్నాయి.  గత నెల  31వ తేదీన  డెక్కన్ మాల్  ను  కూల్చివేశారు.  ఈ మాల్  పరిసర ప్రాంతాల ప్రలజను అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. 
 

click me!