కరోనా, రైతుల సమస్యలపై రేపు కాంగ్రెస్ దీక్ష

Published : May 04, 2020, 02:06 PM ISTUpdated : May 04, 2020, 02:12 PM IST
కరోనా, రైతుల సమస్యలపై రేపు కాంగ్రెస్ దీక్ష

సారాంశం

కరోనా నివారణ, రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వలస కూలీల సమస్యలపై ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఒక్క రోజు దీక్షలు చేయనుంది.  గాంధీభవన్ లో ఉదయం 10 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ దీక్ష ప్రారంభిస్తారు. 

హైదరాబాద్: కరోనా నివారణ, రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వలస కూలీల సమస్యలపై ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఒక్క రోజు దీక్షలు చేయనుంది.  గాంధీభవన్ లో ఉదయం 10 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ దీక్ష ప్రారంభిస్తారు. 

జిల్లా కేంద్రాల్లో డీసీసీ అధ్యక్షులు ఈ దీక్షలను ప్రారంభించనున్నారు. పార్టీ నేతలు తమ ఇళ్లలో దీక్షలను కొనసాగించాలని పార్టీ నాయకత్వం సూచించింది. ఈ మేరకు పీసీసీ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించింది.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు కూడ ఈ దీక్షలు చేయాలని పార్టీ కోరింది. అవకాశం లేని వారు తమ ఇళ్లలో దీక్షలను చేయాలని పీసీసీ కోరింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత వారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతు వి.హనుమంతరావు తన ఇంట్లోనే దీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

also read:కూతురి పెళ్లికి హైద్రాబాద్ వచ్చిన ముంబై వాసులు: 52 రోజులుగా ఇక్కడే

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని కూడ కాంగ్రెస్ పార్టీ సూచించింది. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ దీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలకు పీసీసీ సూచించింది.

also read:రైతాంగ సమస్యలపై ఇంట్లోనే దీక్షకు దిగిన కాంగ్రెస్ నేత వీహెచ్

కరోనా వైరస్ పరీక్షల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సర్కార్ పై ఒంటికాలిపై లేస్తున్న విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?