కూతురి పెళ్లికి హైద్రాబాద్ వచ్చిన ముంబై వాసులు: 52 రోజులుగా ఇక్కడే

By narsimha lodeFirst Published May 4, 2020, 12:04 PM IST
Highlights

లాక్ డౌన్ కారణంగా పెళ్లికి వచ్చిన వధువు బంధువులు 52 రోజులుగా హైద్రాబాద్ లోనే ఉన్నారు. ముంబైకి వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ముంబైకి చెందిన శంకర్ కట్టల్, దీపమ్మ దంపతుల కూతురు పుష్పను హైద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన శ్రీనివాస్ ల వివాహం ఈ ఏడాది మార్చి 19న జరిగింది.


హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా పెళ్లికి వచ్చిన వధువు బంధువులు 52 రోజులుగా హైద్రాబాద్ లోనే ఉన్నారు. ముంబైకి వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ముంబైకి చెందిన శంకర్ కట్టల్, దీపమ్మ దంపతుల కూతురు పుష్పను హైద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన శ్రీనివాస్ ల వివాహం ఈ ఏడాది మార్చి 19న జరిగింది.

వధువుతో పాటు ఆమె బంధువులు ఈ ఏడాది మార్చి 13న నగరానికి చేరుకొన్నారు. పెళ్లి తర్వాత మార్చి 23న తిరిగి ముంబైకి వెళ్లేందుకు టిక్కెట్లను కూడ రిజర్వ్ చేసుకొన్నారు.

తమ కూతురు పెళ్లి జరిగింది. అన్ని సవ్యంగా జరిగాయని భావించిన తరుణంలో అనుకోని రీతిలో లాక్ డౌన్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించింది కేంద్రం.ఈ నెల 17వ తేదీ వరకు  లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

ఇక ముంబైకి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ముషీరాబాద్ లో రెండు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వలస కూలీలు, విద్యార్థులను  తమ స్వంత గ్రామాలకు తరలించేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది.

also read:స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ పాసుల జారీ: తెలంగాణ డీజీపీ

దీంతో తాము ముంబైకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పుష్ప తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం నుండి అనుమతి పత్రంతో పాటు లక్ష రూపాయాలు చెల్లిస్తే ముంబైకి తరలించేందుకు ఓ ప్రైవేట్ సంస్థ ముందుకు వచ్చినట్టుగా వాళ్లు చెబుతున్నారు. 

అయితే లక్ష రూపాయాలు చెల్లించే స్థోమత తమకు లేదని పుష్ప  తల్లిదండ్రులు చెబుతున్నారు. ముంబైకి తమను పంపేందుకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


 

click me!