బయట అడుగుపెట్టకున్నా కరోనా.. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉద్యోగిని మృతి

By telugu news team  |  First Published May 4, 2020, 11:53 AM IST

అల్వాల్ కి చెందిన ఓ యువతి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. కాగా.. లాక్ డౌన్ విధించడంతో... ఇంటికే పరిమితమైంది. ఆమె, కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగుపెట్టలేదు.


కరోనా వైరస్ రాష్ట్రంలో విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు వైరస్ ఉందని తెలిసినా ఖాతరు చేయకుండా.. బయట తిరగడం వల్ల చాలా మందికి కరోనా సోకింది. కాగా.. తాజాగా ఓ యువతికి ఇంట్లో ఉన్నా కూడా కరోనా సోకడం గమనార్హం. ఈ సంఘటన అల్వాల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అల్వాల్ కి చెందిన ఓ యువతి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. కాగా.. లాక్ డౌన్ విధించడంతో... ఇంటికే పరిమితమైంది. ఆమె, కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగుపెట్టలేదు.

Latest Videos

undefined

అయినప్నటికీ యువతికి కరోనా సోకడం గమనార్హం. రెండు రోజుల క్రితం యువతికి శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో.. వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. కాగా.. పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ తేలింది. చికిత్స అందిస్తుండగానే యువతి మృతి చెందింది.

సదరు యువతి అంత్యక్రియలు పోలీసులే నిర్వహించడం గమనార్హం. కాగా... యువతి తల్లిదండ్రులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిని ప్రస్తుతం క్వారంటైన్ కి తరలించారు. 

కాగా...కాగా... సదరు ఉద్యోగిని కి సంబంధించిన సమాచారం ఓ సామాజిక కార్యకర్త ద్వారా మాకు అందింది. అయితే.. మా విచారణలో ఈ వార్త నిజం కాదు అని తేలింది. ఇది గమనించగలరు.

click me!