లక్కీ నెంబర్ ప్రకారం: తొమ్మిదో ఫ్లోర్‌లోకి మారనున్న రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Jan 6, 2024, 5:16 PM IST
Highlights

తెలంగాణ సచివాలయంలో ఆరో ఫ్లోర్ నుండి రేవంత్ రెడ్డి తన ఛాంబర్ ను మార్చనున్నారు.  

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో  తొమ్మిదో ఫ్లోర్‌లోకి మారనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్  7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.  తెలంగాణ సచివాలయంలో  ప్రస్తుతం ఆరో అంతస్తులో  రేవంత్ రెడ్డి  చాంబర్ ఉంది.  అయితే  ఈ చాంబర్ నుండి  9వ అంతస్తులోకి మారాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ సచివాలయంలోని 9వ అంతస్తును  రేవంత్ రెడ్డి  ఇవాళ పరిశీలించారు.  రేవంత్ రెడ్డి కి తొమ్మిది లక్కీ నెంబర్.  దీంతో  9వ, ఫ్లోర్ లోకి రేవంత్ రెడ్డి  మారనున్నారు.  9వ, ఫ్లోర్ లో రేవంత్ రెడ్డి  చాంబర్ లో   అవసరమైన ఇంటీరియర్, ఫర్నీచర్ ను సిద్దం చేస్తున్నారు అధికారులు.

also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: గెలుపునకు కావాల్సిన ఓట్లను ఎలా నిర్ధారిస్తారు

తెలంగాణ రాష్ట్రంలో  గత ఏడాది నవంబర్  30న పోలింగ్ జరిగింది.ఈ ఎన్నికల్లో  భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైంది.  తెలంగాణలో  బీఆర్ఎస్  అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ  అధికారాన్ని దక్కించుకుంది.

also read:కాంగ్రెస్‌కు కలిసొస్తున్న ఈసీ నిర్ణయం: రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం పార్టీకేనా?

ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి  దక్కింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఆదివారానికి  నెల రోజులు అవుతుంది. దీంతో  రేవంత్ రెడ్డి  తన చాంబర్ ను  9వ, ఫ్లోర్ కు మార్చుకోవాలని భావిస్తున్నారు.

తెలంగాణలో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ప్రారంభించిన తర్వాత కొంత కాలానికే  తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. పాత సచివాలయం కూల్చివేసి  అదే స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు.  కొత్త సచివాలయ నిర్మాణాన్ని అప్పట్లో  విపక్షంలో ఉన్న  కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కూడ తీవ్రంగా వ్యతిరేకించాయి.  పాత సచివాలయ కూల్చివేతపై  రేవంత్ రెడ్డి అప్పట్లో  కోర్టును కూడ ఆశ్రయించిన విషయం తెలిసిందే. 
 

click me!