టిడిపియే కాదు వైసిపి ఎంపీలకు తెలంగాణ సీఎం రేవంత్ విందు...

By Arun Kumar P  |  First Published Dec 20, 2023, 8:14 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని న్యూడిల్లీలో కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు విందు ఇచ్చారు. 


న్యూడిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి దేశ రాజధాని డిల్లీకి వెళ్లారు రేవంత్. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కాంగ్రెస్ నాయకులతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు రేవంత్ విందు ఏర్పాటుచేసారు. ఈ విందులో తెలంగాణకు చెందిన ఎంపీలెవరూ పాల్గొనకున్నా మరో తెలుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వైసిపి, టిడిపి ఎంపీలు పాల్గొన్నారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ముందు రేవంత్ రెడ్డి ఎంపీగా పనిచేసారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసారు. అయితే తెలంగాణ సీఎం హోదాలో మొదటిసారి డిల్లీకి వెళ్లిన రేవంత్ గత నాలుగున్నరేళ్లుగా తనతో కలిసి పనిచేసిన వివిధ పార్టీల ఎంపీలకు విందు ఏర్పాటు చేసారు.  

Latest Videos

undefined

రేవంత్ ఏర్పాటుచేసిన విందులో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, వైసిపికి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల మాధవ్, బీద మస్తాన్ రావు, వంగా గీత, చింతా అనురాధ, అయోధ్య రామిరెడ్డి, వల్లభనేని బాలశౌరిలతో పాటు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. అలాగే బిజెపి నేత సీఎం రమేష్ కూడా తెలంగాణ సీఎం విందులో పాల్గొన్నారు. 

Also Read  ఆస్తుల్లో వాటా తేల్చే పనిలో రేవంత్ రెడ్డి .. ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్

ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు శశి థరూర్, చిదంబరం, మాణికం ఠాగూర్, దీపక్ హుడా, గౌరవ్ గొగోయ్ తదితరులు కూడా రేవంత్ విందులో పాల్గొన్నారు. అలాగే బిఎస్పీ నుండి డానిష్ అలీ, రితేష్ పాండే, ఎన్సిపి నుండి ప్రపుల్ పటేల్, డీఎంకే కు చెందిన కళానిధి,  టిఎంసి నేత సౌగత్ రాయ్ హాజరయ్యారు. ఇంకా రేవంత్ కు సన్నిహిత నాయకులు, డిల్లీలోని తెలంగాణ అధికారులు సైతం ఈ విందుకు హాజరయ్యారు. 

click me!