తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనుముల రేవంత్ రెడ్డి తన టీమ్‌ను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బీ. శివధర్ రెడ్డిని నియమించారు. సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీగా శేషాద్రి నియమితులయ్యారు. త్వరలోనే మిగిలిన ఉన్నతాధికారులను నియమించనున్నారు సీఎం.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనుముల రేవంత్ రెడ్డి తన టీమ్‌ను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బీ. శివధర్ రెడ్డిని నియమించారు. సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీగా శేషాద్రి నియమితులయ్యారు. త్వరలోనే మిగిలిన ఉన్నతాధికారులను నియమించనున్నారు సీఎం.
ఇకపోతే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జై సోనియమ్మ నినాదంతో స్పీచ్ ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో, త్యాగల పునాదులతో ఏర్పడిందని అన్నారు. ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్దరనే ద్యేయంగా తెలంగాణ ఏర్పడిందని... కాంగ్రెస్ పార్టీ సమిదిగా మారి తెలంగాణను ఏర్పాటుచేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
undefined
ALso Read: తెలంగాణ క్యాబినెట్ లో ఇద్దరు మహిళలకు చోటు.. వారెవరంటే...
అయితే త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో గత పదేళ్లు సరైన పాలన సాగలేదని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చెబుదామంటే వినేవాళ్లు లేకుండాపోయారని అన్నారు. అందువల్లే ప్రజలు ఆ పార్టీని ఓడించారని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం వెనకున్నది కార్యకర్తలేనని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ఆలోచనను ఉక్కుసంకల్పంగా మార్చి, తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసారని అన్నారు.
కాబట్టి రాష్ట్రంలో తాను, కేంద్రంలో సోనియా గాంధీ కుటుంబం కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా వుంటుందని రేవంత్ అన్నారు. ఇప్పటినుండి తెలంగాణ రైతాంగం, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని... ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు స్వేచ్చ స్వాతంత్రాలు వచ్చాయన్నారు. ప్రగతి చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను ప్రమాణస్వీకారం వేళ బద్దలుగొట్టించామని రేవంత్ తెలిపారు. తన తెలంగాణ కుటంబసభ్యులు ఎప్పుడు రావాలన్నా ప్రగతిభవన్ కు రావచ్చని... సమస్యలు చెప్సుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనను మిళితం చేస్తానని.. మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంతన్నగా మీ మాట నిలబెడతా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.