కూలుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా : బండి సంజయ్ , రేవంత్ రెడ్డిలకు కేసీఆర్ వార్నింగ్

Siva Kodati |  
Published : Feb 12, 2023, 05:10 PM IST
కూలుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా : బండి సంజయ్ , రేవంత్ రెడ్డిలకు కేసీఆర్ వార్నింగ్

సారాంశం

గత కొన్నిరోజులుగా తెలంగాణ కొత్త సచివాలయం, ప్రగతి భవన్‌లకు సంబంధించి రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు సీఎం కేసీఆర్. కూలగొడితే చూస్తూ వూరుకుంటామా అంటూ ఫైర్ అయ్యారు. 

కొత్త సచివాలయం, ప్రగతి భవన్‌లపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. కూలగొడితే చూస్తూ వూరుకుంటామా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారని సీఎం హెచ్చరించారు. అంతా ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీలకు హైదరాబాద్‌లో భవన్‌లు నిర్మిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేయాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. పేదోళ్లకు ప్రవేశం లేని ప్రగతి భవన్ వుంటే ఎంత, లేకపోతే ఎంత అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం లేదని రేవంత్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. 

Also Read: ఇదీ దేశంలో పరిస్దితి..అబద్ధమైతే రాజీనామా చేస్తా : అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ సవాల్

ఆ వెంటనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతి,ని ధ్వంసం చేస్తామన్నారు. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని  బండి సంజయ్  చెప్పారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి  ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. రోడ్డుకు అడ్డం ఉంటే మసీదులు, మందిరాలు కులుస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావిస్తూ  దమ్ముంటే పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చాలని సవాల్ విసిరారు.

అసదుద్దీన్ ఓవైసీ కళ్లలో  ఆనందం  చూసేందుకుగాను  సచివాలయాన్ని తాజ్ మహల్ మాదిరిగా నిర్మించారని  బండి సంజయ్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే  కొత్త సచివాలయంలో   మార్పులు చేర్పులు చేస్తామని  ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు  ఉట్టిపేడేలా  సచివాలయంలో మార్పులు ఉంటాయని  బండి సంజయ్  ప్రకటించారు.  అంతేకాదు ప్రగతి భవన్ ను ప్రజాదర్భార్ గా మారుస్తామని ఆయన  ప్రకటించారు. 

ఇదిలావుండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లపై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ఒకాయన సచివాలయాన్ని కూలగొడతానని అంటున్నాడని మండిపడ్డారు. తాము నిర్మాణాలు చేద్దాం, పునాదులు తవ్వాలనుకుంటున్నామని కేటీఆర్ అన్నారు.వాళ్లలో ఒకాయన సమాధులు తవ్వుతామంటున్నారని.. మరొకాయన బాంబులు పెట్టి పేల్చుతామంటున్నారని సెటైర్లు వేశారు. ఇలాంటి వాళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దని ఆయన ప్రజలను కోరారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?