ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

By narsimha lode  |  First Published Feb 12, 2023, 5:07 PM IST


తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా  వాయిదా పడింది. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత  అసెంబ్లీ  వాయిదా పడింది.  


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆదివారం నాడు నిరవధికంగా  వాయిదా పడింది.  ఆదివారం నాడు మధ్యాహ్నం  అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టారు.ఈ బిల్లుపై  సభలో  చర్చించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీల సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. అనంతరం  తెలంగాణ సీఎం కేసీఆర్  ద్రవ్యవినిమయ బిల్లుపై  చర్చలో పాల్గొన్నారు.   సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు  కేసీఆర్ సమాధానమిచ్చారు కేసీఆర్ సమాధానంపై సభ్యులు ఎవరూడ కూడా  క్లారిఫికేషన్లు కోరలేదు.  వెంటనే  ద్రవ్యవినిమయ బిల్లుకు  తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  అనంతరం  సభను  నిరవధికంగా  వాయిదా వేస్తున్నట్టుగా  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  ప్రకటించారు. 

56 గంటల  25 నిమిషాల పాటు  బడ్జెట్ సమావేశాలు జరిగాయి.  ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు  నిర్వహించారు.ఈ నెల  3వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. ఈ నెల  6వ తేదీన మంత్రి హరీష్ రావు  అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో  38 ప్రశ్నలకు  ప్రభుత్వం సమాధానం తెలిపింది  ఈ సమావేశాల్లో  అధికార, విపక్ష సభ్యుల మధ్య  విమర్శలు, ప్రతి విమర్శలు  చోటు  చేసుకున్నాయి.

Latest Videos


 

click me!