న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కి స్వంత భవనం: పనులను పరిశీలించిన కేసీఆర్

By narsimha lode  |  First Published Oct 12, 2022, 4:37 PM IST

న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లోని  పార్టీ  స్వంత భవన నిర్మాణ పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు పరిశీలించారు. 


న్యూఢిల్లీ:  న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు పరిశీలించారు. నిన్న న్యూఢిల్లీలోని  సర్దార్ పటేల్ రోడ్డులో  ఓ భవనాన్ని  లీజుకు తీసుకున్నారు. ఈ  భవనంలో  బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని కేసీఆర్ నిన్న పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులు చేశారు.ఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ స్వంత భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది సమయంలో పట్టే అవకాశం ఉంది. జీ+3 అంతస్తుల్లో ఈ  భవనాన్నినిర్మించనున్నారు.  ఈ నిర్మాణ పనులను పరిశీలించి  పలు సూచనలు చేశారు కేసీఆర్.  ఈ భవనం నిర్మాణ పనులు చేస్తున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కేసీఆర్  ఇవాళ పలు సూచనలు చేశారు. 

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్.  పార్టీని ఇతరరాష్ట్రాల్లో కూడా విస్తరించాలని తలపెట్టారు.  దేశంలోని అన్నిరాష్ట్రాల నుండి  పార్టీ  కార్యాలయానికి  నేతలు వస్తే నేతలకు ఈ కార్యాలయంలో ఏర్పాట్లు  కూడా ఉండనున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్  నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు.  యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పార్థీవ దేహనికి నివాళులర్పించిన తర్వాత కేసీఆర్ నేరుగా  ఢిల్లీకి చేరుకున్నారు.

Latest Videos

undefined

also read:వారం రోజులు ఢిల్లీలోనే కేసీఆర్: బీఆర్ఎస్ విస్తరణపై చర్చలు

బీఆర్ఎస్ విస్తరణ విషయమై కేసీఆర్  పలువురితో  చర్చించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ వేదికగా కేసీఆర్  చర్చలు జరపనున్నారు. రిటైర్డ్ అధికారులు, రైతు సంఘాల నేతలు, మేథావులు,   పలు పార్టీల నేతలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. 

click me!