మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్ .. ఆగస్ట్ 1న మరోసారి మరాఠా గడ్డకు బీఆర్ఎస్ అధినేత

By Siva Kodati  |  First Published Jul 29, 2023, 9:12 PM IST

ఆగస్ట్ 1న  మహారాష్ట్రలో పర్యటించనున్నారు తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిని ఆయన దర్శించుకోనున్నారు. అలాగే సాహు మహారాజ్ మనవడిని కలవనున్నారు


మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇటీవల 600 కార్ల భారీ కాన్వాయ్‌తో ఆయన మహారాష్ట్రకు వెళ్లి కలకలం రేపారు. తాజాగా ఆగస్ట్ 1న కేసీఆర్ మరోసారి మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా మహారాష్ట్ర దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు కేసిఆర్. అనంతరం కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు సీఎం. ఆ తర్వాత సాహు మహారాజ్ మనవడిని కలవనున్నారు కేసీఆర్. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ALso Read: లోక్ సభపై సీఎం కేసీఆర్ నజర్.. మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి ఎంపీగా పోటీ ?

Latest Videos

కాగా.. టీఆర్ఎస్ .. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత మహారాష్ట్రలో పలు బహిరంగ సభలు నిర్వహించారు కేసీఆర్. అలాగే ఆ రాష్ట్రంలో పలు పార్టీలకు చెందిన నేతలు కూడా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ను కూడా కేసీఆర్ నియమించారు. తన అన్నన కుమారుడు కల్వకుంట్ల వంశీధర్ రావును మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పదిహేను మందితో స్టీరింగ్ కమిటీ కూడా ఆయన ఏర్పాటు చేశారు. 
 

click me!