పార్టీ మార్పు వార్తల వెనుక ఇంటి దొంగలు .. ఓ ముఖ్య నేత పనే ఇది, బీఆర్ఎస్‌లో చేరను : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Siva Kodati |  
Published : Jul 29, 2023, 06:19 PM ISTUpdated : Jul 29, 2023, 06:30 PM IST
పార్టీ మార్పు వార్తల వెనుక ఇంటి దొంగలు .. ఓ ముఖ్య నేత పనే ఇది, బీఆర్ఎస్‌లో చేరను : ఉత్తమ్ కుమార్ రెడ్డి

సారాంశం

తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు టీపీసీసీ మాజీ చీఫ్  ,  నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓ ముఖ్యనేత, కొందరు ఇంటి దొంగలు కావాలనే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు టీపీసీసీ మాజీ చీఫ్  ,  నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఓ ముఖ్య నేత వున్నాడని.. అతనే కుట్ర చేసి ఇదంతా చేయిస్తున్నాడని ఉత్తమ్ శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు . 30 ఏళ్లుగా నిజాయితీ గల కార్యకర్తగా పనిచేస్తే తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రెండేళ్లుగా తమను టార్గెట్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. తాను పార్టీలో కొన్ని సమస్యల పట్ల అసంతృప్తిగా వుండొచ్చునని.. కానీ పార్టీకి సంబంధించిన విధి విధానాలను అనుసరిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు . 24 గంటలూ , 365 రోజులూ ప్రజల కోసమే పనిచేస్తున్నానని.. బీఆర్ఎస్‌లో చేరేది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కడానికి, వాళ్లను తొలగించడమే లక్ష్యంగా ప్రచారం జరిగింది ఆయన ఆరోపించారు. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఉత్తమ్ వాపోయారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?