Hyderabad: దేశరాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయం గురువారం ప్రారంభం కానుంది. దేశ రాజధానిలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రారంభించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
CM KCR to inaugurate BRS central office in Delhi: దేశరాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయం గురువారం ప్రారంభం కానుంది. దేశ రాజధానిలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రారంభించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారి.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే దాని ప్రధాన కార్యాలయాన్ని దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గురువారం ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. రాజధానిలో కేంద్ర కార్యాలయం ప్రారంభమైతే పార్టీ దేశవ్యాప్త విస్తరణ వేగవంతమవుతుందని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
undefined
పార్టీ జాతీయ విస్తరణ, రాజధానిలో ఉనికి కోసం గత ఏడాది నిర్మాణం ప్రారంభించిన నాలుగు అంతస్తుల బీఆర్ఎస్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సమగ్రాభివృద్ధి, రైతుల సాధికారత లక్ష్యంగా స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో మే 4న (గురువారం) గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ భవన నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఢిల్లీలో ఈ భవన నిర్మాణం పూర్తికి సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ భవనం పార్టీ పనులను వేగవంతం చేస్తుందని బీఆర్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
పక్కా వాస్తు సూత్రాల ప్రకారం నిర్మించిన కార్యాలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ వేదోక్త ఆచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నాలుగు అంతస్తుల బీఆర్ఎస్ భవన్ లో కింది గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు చాంబర్లు ఉన్నాయి. మొదటి అంతస్తులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చాంబర్ తో పాటు ఇతర చాంబర్లు, కాన్ఫరెన్స్ హాళ్లు ఉన్నాయి. రెండు, మూడో అంతస్తుల్లో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్, మరో 18 గదులతో కలిపి మొత్తం 20 గదులు ఉన్నాయి.