టీ హబ్ -2.0: స్పష్టంగా తెలంగాణ స్టార్టప్ పాలసీ ... దేశానికే రోల్ మోడల్‌గా టీహబ్ : కేసీఆర్

Siva Kodati |  
Published : Jun 28, 2022, 06:26 PM IST
టీ హబ్ -2.0: స్పష్టంగా తెలంగాణ స్టార్టప్ పాలసీ ... దేశానికే రోల్ మోడల్‌గా టీహబ్ : కేసీఆర్

సారాంశం

టీ హబ్ ఇప్పుదు దేశానికే రోల్ మోడల్ గా మారిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలో ప్రతిభావంతుల్ని ఆకర్షించడానికే టీ హబ్ ప్రారంభించామని.. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా వుందన్నారు కేసీఆర్. 

తెలంగాణ స్టార్టప్ పాలసీ (telangana startup policy) స్పష్టంగా వుందన్నారు సీఎం కేసీఆర్ (kcr) . హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జి హబ్ లో నూతనంగా ప్రారంభించిన టీ హబ్ ఫేజ్ 2ను (t hub) ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో ప్రతిభావంతుల్ని ఆకర్షించడానికే టీ హబ్ ప్రారంభించామని కేసీఆర్ స్పష్టం చేశారు. 2015లో టీ హబ్ ను ప్రారంభించామని.. టీ హబ్ ఇప్పుదు దేశానికే రోల్ మోడల్ గా మారిందని సీఎం అన్నారు. 

కాగా.. టి‌-హబ్ సరికొత్త రూపాన్ని సంతరించుకుని టీ‌-హబ్ ఫేజ్2 గా ఆవిష్కరించబడింది. పది అంతస్తులతో T ఆకారంలో టీ‌‌- హబ్ భవనం చూడగానే ఆకర్షించేలా అద్భుతంగా నిర్మితమైంది. 3.75 లక్షల చదరపు అడుగుల్లో కాంక్రీట్, స్టీల్, గ్లాస్ సమ్మేళనంగా అంతరిక్ష నౌకను తలపించేలా నిర్మితమైన ఈ టీ‌-హబ్ భవనాన్ని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ అర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసింది. 

Also Read:TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రూ.400 కోట్ల నిధులను టీ-హబ్ నిర్మాణానికి కేటాయించినట్లు తెలంగాణ ఐటీ & పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. టి-హబ్ ఫేజ్1 కంటే తాజాగా ఏర్పాటుచేసిన ఫేజ్2 ఐదురెట్లు పెద్దదని తెలిపారు. దాదాపు 4,000 స్టార్టప్స్ ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే సామర్థ్యం టి‌-హబ్ కు వుంది.  45దేశాలకు చెందిన ట్రేడ్ ఆఫీస్, వెంచర్ క్యాపిటల్ ఫండ్,  ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ తదితర సదుపాయాలు టి-హబ్ కలిగివుంది. 

ఇక స్టార్టప్ ఇండియా మిషన్ కింద సైన్స్ ఆండ్ టెక్నాలజీ విభాగం సహకారంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెంటర్ కూడా టి‌-హబ్ లో ఏర్పాటు చేసినట్లు జయేశ్ రంజన్ తెలిపారు.  హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ క్యాంపన్ లో టి-హబ్ ఫేజ్1 లో కొనసాగుతున్న  200 స్టార్టప్స్ జూలై 1వ తేదీ నుండి టి-హబ్ ఫేజ్2 కార్యకలాపాలు ప్రారంభంకాగానే కొత్త భవనంలోకి మారతాయన్నారు. ఇప్పటికే టి-హబ్ దాదాపు 1,100 స్టార్టప్‌లకు ఇంక్యుబేట్ చేయడంలో సహాయపడిందని... అవి సుమారు 10,000 కోట్లను సమీకరించాయని జయేశ్ రంజన్ తెలిపారు. ఇక టి-హబ్ సీఈవో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... టీ-హబ్ ఫేజ్2 భవనంలో ఓ అంతస్తు మొత్తాన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ కోసమే కేటాయించామన్నారు. ఇది హైదరాబాద్ లో స్టార్టప్స్ ఏర్పాటుకు ఎంతో ఊతమిస్తుందని శ్రీనివాస్ రావు అన్నారు

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu