విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం.. కేంద్రం తీరుపై కేసీఆర్ సీరియస్, అధికారులకు కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Aug 19, 2022, 6:25 PM IST
Highlights

పవర్ ఎక్స్చేంజ్‌పై సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.

పవర్ ఎక్స్చేంజ్‌పై కేంద్రం తీరును తప్పుబట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. పవర్ ఎక్స్చేంజ్‌పై సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావులను ఆదేశించారు. 

అనంతరం దీనిపై ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ కొనుగోళ్లు జరపకుండా కేంద్రం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇవాళ 20 మిలియన్ యూనిట్లు డ్రా చేయలేకపోయామని.. ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదన్నారు. రూ.1360 కోట్లు కట్టినప్పటికీ ఇలా చేయడం బాధాకరమని ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జనరేటర్, డిస్కంలకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వుంటుందన్నారు. ఇది వారి ఒప్పందంతో అమ్ముకోవచ్చని... రాష్ట్రంలో జల విద్యుత్, థర్మల్, సోలార్ విద్యుత్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవుతోందని ప్రభాకర్ రావు పేర్కొన్నారు.     

ఇకపోతే.. కేంద్ర ఎనర్జీ ఎక్చేంజీకి బకాయి చెల్లింపు విషయంలో డిఫాల్టర్ గా మారడంతో ఇండియన్  పవర్  సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలు విషయమై తెలంగాణకు ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఎనర్జీ ఎక్చేంజీకి బకాయి పడడంతో తెలంగాణ,ఏపీ సహా మరో 13 రాష్ట్రాలు కేంద్ర పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ నిషేధం ఈ నెల 18వ తేదీ రాత్రి నుండి అమల్లోకి వచ్చింది.గతంలో కూడా ఇదే తరహాలో పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలు విషయమై పలు రాష్ట్రాలపై నిషేధం విధించినా వెంటనే తొలగించిన పరిస్థితులున్నాయి. 

ALso REad:తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం షాక్: పీఓఎస్ఓసీఓ నుండి విద్యుత్ కొనుగోలుపై నిషేధం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 1380 కోట్లను పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్  కు బకాయి పడింది.దేశంలో మొత్తం 13 రాష్ట్రాలు సుమారు రూ. 5,080 కోట్లు బకాయిలున్నాయి. ఈ బకాయిలు చెల్లించడానికి గడువు కూడా దాటిపోయింది. ఈ గడువు పూర్తైనా కూడ బకాయిలు చెల్లించని కారణంగా పవర్ సిస్టమ్ నిర్ణయం తీసుకొంది. దేశంలోని  అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ రాష్ట్రమే ఈ కార్పోరేషన్ కు ఎక్కువ నిధులు బకాయి పడింది. అన్ని రాష్ట్రాలు వెయ్యి కోట్ల లోపుగానే బకాయిలుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం రూ., 1380 కోట్లు బకాయిలు పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 412 కోట్లు మాత్రమే బకాయి  చెల్లించాల్సి ఉంది. 

తెలంగాణలో విద్యుత్ ను ఉత్పత్తి చేసే జెన్ కోకు అన్ని బకాయిలను చెల్లించామని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో చైర్మెన్ ప్రభాకర్ రావు  మీడియాకు తెలిపారు.నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ విద్యుత్ సరపరాను క్రమబద్దీకరిచేందుకు ఉద్దేశించిన సంస్థ అని ప్రభాకర్ రావు చెబుతున్నారు. అయితే వాణిజ్య పరమైన అంశాలపై ఈ సంస్థ జోక్యాన్ని ప్రభాకర రావు తప్పు బడుతున్నారు. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ పాత్రను కోర్టులో సవాల్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై స్టే ఆర్డర్ ఉందని ఆయన వివరించారు.

click me!