విద్యార్ధి ఆత్మహత్యాయత్నం వ్యవహారం.. తెలంగాణ సర్కార్ సీరియస్, నారాయణ కాలేజీకి నోటీసులు

Siva Kodati |  
Published : Aug 19, 2022, 05:59 PM IST
విద్యార్ధి ఆత్మహత్యాయత్నం వ్యవహారం.. తెలంగాణ సర్కార్ సీరియస్, నారాయణ కాలేజీకి నోటీసులు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీ‌ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కాలేజీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. కాలేజ్ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.   

కాగా.. రామంతాపూర్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. టీసీ తీసుకునేందుకు కాలేజీకి వెళ్లిన విద్యార్ధి ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి ఆయనను టీసీ ఇవ్వమని కోరాడు. అయితే గతకొద్దిరోజులుగా బాధిత విద్యార్ధి టీసీ కోసం కాలేజీకి వెళ్తుంటే తిప్పుతున్నారు. దీంతో విసిగిపోయిన ఆ విద్యార్ధి ప్రిన్సిపాల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 

ALso REad:నారాయణ కాలేజీ ఘటన: మెరుగైన చికిత్స కోసం ముగ్గురు విద్యార్ధులు యశోద ఆసుపత్రికి తరలింపు

అంతేకాదు.. శరీరం మంటల్లో కాలిపోతుండగానే ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని పట్టుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అరుపులు , కేకలు వినిపించడంతో ఏవో అశోక్ రెడ్డి ప్రిన్సిపాల్‌ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ముగ్గురి మంటలను అదుపు చేసి ఆసుపత్రికి తరలించారు. తొలుత గాంధీ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!