చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదా .. కొడంగల్‌ గడ్డపై రేవంత్‌పై చెలరేగిపోయిన కేసీఆర్

By Siva Kodati  |  First Published Nov 22, 2023, 7:32 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వెళ్లి దొరికిపోయారని.. రేవంత్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావంటూ సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో 15 మంది సీఎం అభ్యర్ధులు వున్నారని.. రేవంత్ ముఖ్యమంత్రి కాలేరని కేసీఆర్ జోస్యం చెప్పారు.


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. రేవంత్ టికెట్లు అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని చురకలంటించారు. ఆయనకు చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వెళ్లి దొరికిపోయారని.. రేవంత్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావంటూ సీఎం వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌లో 15 మంది సీఎం అభ్యర్ధులు వున్నారని.. రేవంత్ ముఖ్యమంత్రి కాలేరని కేసీఆర్ జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి ఓ నీతి, పద్ధతి లేవని.. ఆయనకు వ్యవసాయం తెలుసా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఓ భూకబ్జాదారుడని కేసీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ నుంచి గతంలో వలసలు వుండేవని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ వాళ్లు ధరణి స్థానంలో భూమాతను తెస్తామని అంటున్నారని, కానీ అది భూమేత అని కేసీఆర్ సెటైర్లు వేశారు. 

Latest Videos

undefined

Also Read: పదవుల కోసం ఏనాడు పాకులాడలేదు .. తెలంగాణ ఆగం కావొద్దనే నా బాధ: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు పరిగిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. సాధించుకున్న తెలంగాణ ఆగం కావొద్దనేది తన తాపత్రయమన్నారు. వచ్చే ఏడాది మిషన్ మోడ్‌లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని.. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తాను ఉన్నంత వరకు బీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టీయేనని సీఎం వెల్లడించారు. ఎస్సీలు, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా చూసిందని కేసీఆర్ దుయ్యబట్టారు. 

ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏళ్లు గోసలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన రోజున భయంకరమైన సమస్యలు వున్నాయన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని.. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామని కేసీఆర్ తెలిపారు. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని.. కంటి వెలుగులో 80 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చామని ఆయన చెప్పారు. రైతుబంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ అని.. రైతులకు 24 గంటలు నాణ్యమైన , ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. 

click me!