పోలీసులతో వివాదం.. నా తప్పేం లేదు, ఆ అధికారే : స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ

By Siva Kodati  |  First Published Nov 22, 2023, 7:04 PM IST

చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. 


చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి సంతోష్ నగర్ పీఎస్ పరిధిలోని మొయిన్‌బాగ్‌లో ఎంఐఎం పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగించారు. అప్పటికే అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చూస్తున్న సీఐ శివచంద్ర.. రాత్రి 10 గంటలు కావడంతో స్టేజ్ మీదకు వెళ్లారు. సభకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి వుండటంతో ఆ విషయాన్ని చెప్పేందుకు సీఐ ప్రయత్నించారు. 

అయితే సీఐ శివచంద్ర ఆ మాట అనగానే అక్బరుద్దీన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రచారం ముగియడానికి ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని.. ముందే ఎలా ఆపుతారంటూ మండిపడ్డారు. తన వద్ద ఉన్న వాచీ ఇస్తానని.. సమయం చూసుకో అని అన్నారు. ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని.. తాను కచ్చితంగా మాట్లాడి తీరుతానని పేర్కొన్నారు. తనను ఆపే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు.  తాను చాంద్రయణగుట్ట ప్రజలకు కనుసైగ చేస్తే పోలీసులు పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తాను అలసిపోయానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తాను ఇప్పటికీ ధైర్యంగా, బలంగా ఉన్నానని చెప్పారు. దయచేసి రెచ్చగొట్టవద్దని కోరారు. 

Latest Videos

undefined

ALso Read: నేను కనుసైగ చేస్తే..: సీఐకి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వార్నింగ్..!!

ఆపై తన విధులకు ఆటంకం కలిగించారంటూ అక్బరుద్దీన్‌పై సీఐ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని, నిబంధనల మేరకే నడుచుకున్నానని స్పష్టం చేశారు. పోలీసులే అనవసరంగా వేదికపైకి వచ్చారని, తన దగ్గర అన్ని అనుమతులు వున్నాయని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఆ పోలీస్ అధికారిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని ఒవైసీ తెలిపారు. 

click me!