గాలి పటాల మాంజాలు.. త్రివర్ణ పతాకాలు అన్నీ చైనావే, ఇదేనా మేకిన్ ఇండియా: మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 10, 2022, 07:45 PM IST
గాలి పటాల మాంజాలు.. త్రివర్ణ పతాకాలు అన్నీ చైనావే, ఇదేనా మేకిన్ ఇండియా: మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు

సారాంశం

మేకిన్ ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అదో అట్టర్ ఫ్లాప్ పాలసీ అంటూ చురకలు వేశారు. బీజేపీ పాలనలో ఆర్ధిక వ్యవస్థ నాశనం అయ్యిందని సీఎం చురకలు వేశారు. 

మేకిన్ ఇండియా ఘోరమైన అట్టర్ ఫ్లాప్ అంటూ బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పిల్లలు ఆడుకునే పతంగి మాంజాల నుంచి జాతీయ పతాకాల దాకా అన్నీ చైనావేనంటూ కేసీఆర్ చురకలు వేశారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టడమే బీజేపీ పని అంటూ కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ పాలనలో ఆర్ధిక వ్యవస్థ నాశనం అయ్యిందని... పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా తరలి వెళ్లిపోతున్నాయని సీఎం గుర్తుచేశారు. 

బీజేపీ వస్తే రైతు బీమా, రైతు బంధు ఇస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. కోర్టులు, జర్నలిస్టులంటే కేంద్రానికి గౌరవం లేదని సీఎం మండిపడ్డారు. తెలంగాణలోనూ ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తామని చెబుతున్నారని.. బీజేపీ నేతలు ప్రజాస్వామ్య హంతకులు కారా అని కేసీఆర్ ప్రశ్నించారు. బ్యాంకు దొంగల్ని ఎందుకు పట్టుకోవడం లేదని సీఎం నిలదీశారు. బ్యాంకు దొంగల్లో మీరూ భాగస్వాములేనని కేసీఆర్ ఆరోపించారు. బ్యాంకు దొంగలను దేశానికి తీసుకురావడం మీకు చేతకాదా అని ఆయన నిలదీశారు. 

Also Read:నోటికొచ్చినట్లు మాట్లాడింది... సుప్రీంకోర్టు జడ్జిలని కూడా బెదిరిస్తారా : నుపుర్ శర్మపై కేసీఆర్ ఆగ్రహం

తెలంగాణకు చేతకాని బీజేపీ అవసరం లేదని... మీరు విశ్వ గురువులా, విష గురువులా అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.4 వేలకు దొరికే బొగ్గును రూ.30 వేల నుంచి రూ.40 వేలు పెట్టి కొనాలనడం జబర్దస్తీ కాదా అని సీఎం మండిపడ్డారు. దేశ చరిత్రలోనే అత్యంత అసమర్ధ ప్రధాని మోడీనే అని కేసీఆర్ అభివర్ణించారు. మీ అసమర్ధ విధానాల వల్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు విదేశాలకు తరలిపోతున్నాయని సీఎం అన్నారు. మోడీ విదేశాలకు వెళ్లి గుప్పెడు మంది పెట్టుబడిదారులకు సేల్స్‌మెన్ గా పనిచేశాడంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.