తుమ్మలను గెలిపిస్తే ముళ్లు గుచ్చుకుంటాయి: ఖమ్మం సభలో కేసీఆర్

By narsimha lode  |  First Published Nov 5, 2023, 5:11 PM IST


తెలంగాణ సీఎం కేసీఆర్  ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం  చేశారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ఇవాళ రెండు సభల్లో  కేసీఆర్ పాల్గొన్నారు.


ఖమ్మం: ఖమ్మంలో పువ్వాడ పువ్వులు కావాలా, తుమ్మల తుప్పలు కావాలా  తేల్చుకోవాలని తెలంగాణ సీఎం  ప్రజలను కోరారు. తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయి... మీ ఇష్టమని  కేసీఆర్  చెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్  ఆదివారంనాడు  ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  పాల్గొన్నారు. పువ్వాడ అజయ్  చేతిలో ఓడిపోయి  తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో  కూర్చుంటే  పిలిచిమంత్రి పదవి ఇచ్చినట్టుగా  సీఎం గుర్తు చేశారు. ఈ విషయం తాను  చెబితే  తనకే మంత్రి పదవి ఇప్పించినట్టుగా  తుమ్మల నాగేశ్వరరావు  విమర్శలు చేశారన్నారు. ఎవరికి ఎవరు మంత్రి పదవి ఇప్పించారో  మీ కళ్ల ముందే ఉంది కదా అని  కేసీఆర్  చెప్పారు.

Latest Videos

undefined

తుమ్మల నాగేశ్వరరావుకు  మంత్రి పదవిని అప్పగిస్తే  ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ తప్ప ఒక్కరు కూడ  బీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించలేదన్నారు. ఈ జిల్లాలో  ఇద్దరి పీడను వదిలించామని  తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి  కేసీఆర్ వ్యాఖ్యానించారు.  వీరిద్దరూ పార్టీని వడడంతో  జిల్లాలో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించనుందని  కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్ధులను అసెంబ్లీ గడప తొక్కనివ్వనని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  వ్యాఖ్యలపై  కేసీఆర్ ఫైర్ అయ్యారు.  ఖమ్మం జిల్లానే గుత్త పట్టావా అని ఆయన  ప్రశ్నించారు.  ఈ వ్యాఖ్యలపై  ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలని కేసీఆర్ కోరారు.ఇది ఎంతవరకు  ధర్మమని ఆయన ప్రశ్నించారు

also read:శివలింగం మీద తేలు లాంటొడు: కేసీఆర్ పై తుమ్మల సెటైర్లు

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా  ప్రజాస్వామ్య పరిణితి ఇంకా రాలేదని కేసీఆర్  అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిణితి రావాలంటే  యువత ముందుకు రావాలన్నారు. ఓటు వేసే సమయంలో అభ్యర్ధుల గుణగుణాలను పరిశీలించాలని  కేసీఆర్  ప్రజలను కోరారు.అంతేకాదు అభ్యర్ధి వెనుక ఉన్న పార్టీల గురించి కూడ ఆలోచన చేయాలన్నారు.ఖమ్మం చాలా చైతన్యమైన ప్రాంతంగా ఆయన గుర్తు చేశారు. గెలిచాక అందుబాటులో ఉంటాడా.. టాటా చెబుతాడా పరిశీలించుకోవాలన్నారు.ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్తు ఉంటుందని  కేసీఆర్   చెప్పారు.

గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేశాయో ఆలోచించాలన్నారు.ఒకప్పుడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి రోడ్లుగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు  ఖమ్మం అంటే ఆరులైన్ల రోడ్డు, సుందర వీధులుగా  మారిందన్నారు.  పువ్వాడ అజయ్ ను గెలిపిస్తే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని కేసీఆర్  చెప్పారు.ఖమ్మం ఎలా అభివృద్ది చెందిందో  మీరు స్వయంగా చూశారన్నారు.మంత్రి పువ్వాడ కృషితోనే ఖమ్మం అభివృద్ది చెందిందని  కేసీఆర్ గుర్తు చేశారు.
 

click me!