ఒమిక్రాన్ వ్యాప్తి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కానీ, అజాగ్రత్త పనికి రాదనీ, అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిపై సుదీర్ఘంగా చర్చించారు.
CM KCR REVIEW ON CORONA: తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిపై సుదీర్ఘంగా చర్చించారు. ఒమిక్రాన్ వ్యాప్తి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ, అజాగ్రత్త పనికి రాదనీ, అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు.
ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. మౌలిక వసతుల కల్పనపై పటిష్ట పరచాలని, బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను సమకూర్చుకోవాలని సూచించారు.
undefined
Read Also : తెలంగాణలో Lockdownపై క్లారిటీ ఇచ్చిన డీహెచ్ శ్రీనివాసరావు.. ఆయన ఏం చెప్పారంటే..
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని, మిగిలిన ఒక శాతం బెడ్లను కూడా ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సూచించారు. గతంలో తెలంగాణలో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్నా.. ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామని, ప్రస్తుతం ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే.. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను సిద్దం చేయాలని, ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఖాళీలు 15 రోజుల్లో భర్తీ చేయాలని ఆ మేరకు కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు.
Read Also : Coronavirus: మెడికల్ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా
కంటోన్మెంట్ జోన్ పరిధిలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు మరో 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే రసూల్ పుర లో 2, ఎల్.బి.నగర్, శేర్ లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, జల్ పల్లి, మీర్ పేట, పిర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్ నగర్, నిజాంపేట్ ల్లో ఒక్కొటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు.
Read Also : coronavirus: దేశంలో భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు..
అలాగే.. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో హైదరాబాద్ తరహాలో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 4, నిజామాబాద్ లో 3, మహబూబ్ నగర్ లో 2 , నల్గొండలో 2, రామగుండం లో 2 , ఖమ్మం లో 2, కరీంనగర్ లో 2 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే.. జగిత్యాల, సూర్యాపేట, సిద్ధిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్, మంచిర్యాల, తాండూర్, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల్, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్ పూర్, గజ్వేల్, మెదక్ లలో ఒక్కొటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.