కరోనా రోగులతో వ్యాపారం: ప్రైవేట్ ఆసుపత్రులకు కేసీఆర్ వార్నింగ్

By Siva KodatiFirst Published Jul 17, 2020, 6:52 PM IST
Highlights

కరోనా రోగుల పట్ల ప్రైవేట్ ఆసుపత్రులు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రతపై ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు

కరోనా రోగుల పట్ల ప్రైవేట్ ఆసుపత్రులు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రతపై ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్ భయంతో ప్రజలు హైరానా పడి ప్రైవేట్ ఆసుపత్రులకు పోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: బస్టాండ్‌లోనే కుప్పకూలిన వృద్ధుడు, పట్టించుకోని జనం.. చివరికిలా....

ప్రస్తుతం కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్ధితి నెలకొందని, వైరస్ విషయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాల్సిందేనని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణలో భయంకరమైన పరిస్థితి లేదని, అలాగని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కేసీఆర్ సూచించారు.

రాష్ట్రానికి రావాల్సిన అన్ని సౌకర్యాలు వేగంగా సమకూర్చుకున్నామని గుర్తుచేశారు. గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో 3 వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో ఉన్నాయని.. వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేలు వేతనాలు చెల్లిస్తామని కేసీఆర్ తెలిపారు.

Also Read:కరోనా దెబ్బ: తెలంగాణ ఆర్టీసీకి 4 నెలల్లో రూ. 1000 కోట్ల నష్టం

ఆయుష్ అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆన్ లాక్‌ ప్రక్రియ నడుస్తోందని.. అంతర్జాతీయ విమానాలు నడపాలని కూడా కేంద్రం నిర్ణయించిందని ముఖ్యమంత్రి తెలిపారు.

అవగాహన లేకుండా ప్రతిపక్షాలు చేసే చిల్లరమల్లర విమర్శలు పట్టించుకోవద్దని.. తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రభావం కొనసాగుతూనే ఉందన్నారు. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడానికి వైద్యులు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షాల తీరు సరైంది కాదని వ్యాఖ్యానించారు. 

click me!