మాయమైపోతున్నాడమ్మా... మనిషన్నవాడు అని ఓ కవి రాసిన మాటలు కరోనా కాలంలో పలు సందర్భాల్లో నిజమేననిపిస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నాడు ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది.
కామారెడ్డి: మాయమైపోతున్నాడమ్మా... మనిషన్నవాడు అని ఓ కవి రాసిన మాటలు కరోనా కాలంలో పలు సందర్భాల్లో నిజమేననిపిస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నాడు ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది.
మెదక్ జిల్లాలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన హన్మంత్ ముంబై వెళ్లేందుకు ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకొన్నారు. బస్సు దిగిన కొద్దిసేపటికే ఆయన కుప్పకూలిపోయాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. గంట పాటు ఆయన బస్టాండ్ ఆవరణలోనే అలాగే పడి ఉన్నాడు.
undefined
also read:కరోనాపై చికిత్సకు మరో రూ. 100 కోట్లు, వైద్య శాఖలో ప్రతి ఒక్కరికి 10 శాతం ఇన్సెంటివ్: కేసీఆర్
అయితే కిందపడిపోయిన హన్మంత్ ను చూసి ఎవరూ కూడ దగ్గరకు రాలేదు. కనీసం ఏమైందని కూడ అడగలేదు. చివరకు ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకొని 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఆయన ఆసుపత్రిలోనే మరణించాడు. తొమ్మిది నెలల క్రితం ముంబై నుండి కూతురి ఇంటికి వచ్చాడు హన్మంత్. అయితే ఉపాధి లేకపోవడం, అనారోగ్య సమస్యలతో తిరిగి ముంబైకి వెళ్లాలని హన్మంత్ నిర్ణయం తీసుకొన్నాడు. దీంతో కామారెడ్డి బస్టాండ్ కు వచ్చిన సమయంలో అస్వస్థతకు గురయ్యాడు.