హైదరాబాద్‌ను దిగ్బంధించండి... వైరస్ అంతుచూడండి: కేసీఆర్

By Siva KodatiFirst Published May 6, 2020, 8:29 PM IST
Highlights

కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో కోవిడ్ 19 నివారణ, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై బుధవారం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో కోవిడ్ 19 నివారణ, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై బుధవారం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే కరోనా ప్రభావం ఉందని... నగరంతో పాటు మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే కొత్త కేసులు వస్తున్నాయని సీఎం తెలిపారు. రాజధానిపై అధికారులు ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also Read:తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. ప్రజలు సహకరించాలి: కేసీఆర్

హైదరాబాద్‌కు రాకపోకలు బంద్ చేయాలని... నగరం నుంచి బయటకు పోకుండా.. బయటి వారు లోపలికి రాకుండా కఠినచర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

హైదరాబాద్‌ను చుట్టుముట్టాలని.. వైరస్‌ను తుదముట్టించాలని కేసీఆర్ అన్నారు. ఈ భేటీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 

కాగా తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందు నుంచి పకడ్బందీగా చర్యలు చేపట్టడం వల్ల వైరస్‌ను అదుపు చేసి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచామని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ నుంచి నేర్చుకుని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేశామని ఆయన చెప్పారు.

Also Read:మందుబాబులకు గుడ్ న్యూస్: మద్యం అమ్మకాలకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్

దేశంలో మరణాల రేటు 3.37 శాతంగా ఉంటే తెలంగాణలో 2.64 శాతంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 42.7 శాతంగా ఉందని.. కరోనా కట్టడికి కృషి చేసిన అధికారులు, నేతలు, సిబ్బందిని కేసీఆర్ అభినందించారు.

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ కోసం సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగస్టు, సెప్టెంబర్ నాటికి అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. మనదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో భయంకరంగా చనిపోతున్నారని కేసీఆర్ గుర్తుచేశారు.
 

click me!