యూరియా కొరతపై కేసీఆర్ దృష్టి, లక్ష టన్నులు రప్పించేందుకు ప్లాన్: ఏపీమంత్రి పేర్ని నానికి ఫోన్

By Nagaraju penumalaFirst Published Sep 6, 2019, 6:16 PM IST
Highlights

నాలుగు రోజుల్లో లక్ష టన్నుల యూరియా తెలంగాణ రైతులకు అందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను సీం కేసీఆర్ ఆదేశించారు. సమస్యపరిష్కారమయ్యే వరకు రాత్రింబవల్లు పనిచేయాలని మంత్రులను ఆదేశించారు. 

హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రైతులకు సరిపోయే యూరియా గ్రామాలకు సరఫరా చేయాలని సూచించారు. మూడు నాలుగు రోజుల్లో ఎరువులు రైతులకు అందాలని సూచించారు. 

నౌకాశ్రయాల్లో ఉన్న స్టాక్ ను రైళ్లు, లారీల ద్వారా తీసుకురావాలన్నారు. స్టాక్ పాయింట్లు కాకుండా నేరుగా గ్రామాలకే పంపాలని సూచించారు. యూరియా తరలింపుకు సంబంధించి రైల్వే అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. 

ఎయిర్ పోర్ట్ నుంచి యూరియా తరలింపునకు 25 గూడ్సులు ఇవ్వాలని కోరారు. శనివారం గూడ్స్ రైలు కేటాయిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే పోర్టుల్లో పర్యవేక్షణకు ఒక్కో అధికారిని పంపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

మరోవైపు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినానితో సైతం సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి యూరియా పంపించేందుకు సహకరించాలని కోరారు. ఏపీలోని లారీలతో యూరియా పంపుతామని పేర్నినాని హామీ ఇచ్చారు. 

నాలుగు రోజుల్లో లక్ష టన్నుల యూరియా తెలంగాణ రైతులకు అందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను సీం కేసీఆర్ ఆదేశించారు. సమస్యపరిష్కారమయ్యే వరకు రాత్రింబవల్లు పనిచేయాలని మంత్రులను ఆదేశించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

యూరియా కోసం అన్నదాత చనిపోవడం కలచివేసింది: పవన్ కళ్యాణ్

తెలంగాణలో యూరియా కష్టాలు: క్యూ లైన్లో స్పృహ కోల్పోయిన మహిళా రైతు

విషాదం: యూరియా కోసం క్యూలైన్లో నిలబడ్డ రైతు మృతి

యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతు మృతి: ప్రభుత్వ హత్య అంటూ కాంగ్రెస్ మండిపాటు

click me!